Home /Author Narasimharao Chaluvadi
ఆంధ్రప్రదేశ్ లో ముసాయిదా ఓటర్ల జాబితాను చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ ముకేష్ కుమార్ మీనా ప్రకటించారు. నవంబర్ 9 నాటికి నకిలీ ఓటర్లు, మృతులు, ఒకే పేరుతో వేర్వేరు ప్రాంతాల్లో నమోదైన 10,52,326 ఓట్లను ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా తొలగించిన్నట్లు సీఈవో వెల్లడించారు.
తెలంగాణలో సంచలన సృష్టించిన ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. ఏడుగురు సభ్యులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి రవి గుప్త ఉత్తర్వులు జారీ చేశారు.
డిసెంబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను నవంబర్ 11వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టిటిడి తెలిపింది.
ఫేస్ బుక్ మాతృ సంస్ధ మెటా తన కంపెనీలో పనిచేస్తున్న 11వేల మంది ఉద్యోగుకు ఉద్వాసన పలకనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మెటా కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్ బర్గ్ పేర్కొన్నారు.
రాజ్ భవన్ - ప్రగతి భవన్ ల మద్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధంలో తెరాస ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అప్రజాస్వామిక పాలన సాగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పీడీ చట్టం కింద చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ధర్మాసనం మంజూరు చేసింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దనింది.
ఏపీ ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతుంది. అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. రెండేళ్ల నుండి నిరుద్యోగులను మోసం చేస్తున్న ఇద్దరి కానిస్టేబుల్స్ అరెస్ట్ తో అసలు బండారం బయటపడింది.
మనీ లాండరింగ్ కేసులో మూడున్నర నెలలుగా జైలులో ఉన్న ఫైర్ బ్రాండ్, శివసేన ఉద్ధవ్ ధాకరే పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ కు ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ప్రముఖ ఇ-కామర్స్ సంస్ధ అమెజాన్ తన వస్తువుల డెలివరీలో విద్యుత్ వాహనాలను వినియోగించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రముఖ మోటారు కంపెనీ టివిఎస్ తో ఒప్పందం కుదుర్చుకుంది. వినియోగదారులకు వస్తువులను డెలివరీలో రెండు, మూడు చక్రాల వాహనాలను వినియోగించనున్నారు.
తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై నమోదైన భూఆక్రమణ కేసు కొట్టివేయాలని దాఖలైన పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు వెలువరించింది.