Serbia Mass shooting: సెర్బియాలో మరో సామూహిక కాల్పుల ఘటన.. 8 మంది మృతి, 10 మందికి గాయాలు
సెర్బియాలో 21 ఏళ్ల యువకుడు జరిపిన కాల్పుల్లో 8 మంది మరణించగా 10 మంది గాయపడ్డారు. దేశంలో రెండురోజుల్లో ఇది ఈ తరహా రెండవ సంఘటన కావడం విశేషం. రెండురోజులకిందట బెల్ గ్రేడ్ పాఠశాలలో 14 ఏళ్ల బాలుడు జరిపిన కాల్పుల్లో 8 మంది విద్యార్దులతో సహా సెక్యూరిటీ గార్డు మరఠణించిన విషయం తెలిసిందే.
Serbia Mass shooting: సెర్బియాలో 21 ఏళ్ల యువకుడు జరిపిన కాల్పుల్లో 8 మంది మరణించగా 10 మంది గాయపడ్డారు. దేశంలో రెండురోజుల్లో ఇది ఈ తరహా రెండవ సంఘటన కావడం విశేషం. రెండురోజులకిందట బెల్ గ్రేడ్ పాఠశాలలో 14 ఏళ్ల బాలుడు జరిపిన కాల్పుల్లో 8 మంది విద్యార్దులతో సహా సెక్యూరిటీ గార్డు మరఠణించిన విషయం తెలిసిందే.
నిందితుడిని పట్టుకోవడానికి పెద్ద ఎత్తున బలగాలు..(Serbia Mass shooting)
బెల్గ్రేడ్కు దక్షిణంగా 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మ్లాడెనోవాక్ సమీపంలో కాల్పులు జరిగాయి. ఆటోమేటిక్ ఆయుధంతో కాల్పులు జరిపిన వ్యక్తిని విస్తృత శోధన తర్వాత నిందితుడిని క్రాగుజెవాక్ నగరానికి సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. నిందితుడిని పట్టుకోవడానికి సాగిన ఆపరేషన్ లో 600 మంది పోలీసు అధికారులు పాల్గొన్నారు. శుక్రవారం తెల్లవారుజామున, తాజా కాల్పులు జరిగిన మ్లాడెనోవాక్ మరియు డుబోనా గ్రామాలకు ప్రత్యేక పోలీసు బలగాలు చేరుకున్నాయని సెర్బియా మీడియా తెలిపింది.
పోలీసు అధికారులు చెక్‌పోస్టుల వద్ద కార్లను తనఖీలు చేసారు.ఒక హెలికాప్టర్, డ్రోన్లు మరియు బహుళ పోలీసు గస్తీని కూడా ఉపయోగించారు.నిందితుడు 2002లో జన్మించినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది.గురువారం సాయంత్రం దుబోనాలోని ఓ పార్కులో పోలీసు అధికారితో వాగ్వాదానికి దిగిన తర్వాత ఆటోమేటిక్ వెపన్తో వ్యక్తులపై కాల్పులు జరిపాడని స్థానిక మీడియా నివేదికలు చెబుతున్నాయి.సెర్బియాలో సామూహిక కాల్పులు జరగడం చాలా అరుదు. అయితే 1990ల నాటి యుద్ధాల తర్వాత దేశంలో మిగిలిపోయిన ఆయుధాల సంఖ్య గురించి నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- Karnataka Elections: కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న బ్రహ్మానందం.. ఏ పార్టీ తరపునో తెలుసా?
- Chandrababu Naidu Assistance: వైసీపీ మహిళా రైతుకు చంద్రబాబునాయుడు ఆర్దికసాయం