Cristiano Ronaldo: మైదానంలో వెక్కి వెక్కి ఏడ్చిన రొనాల్డో.. ఫొటోలు వైరల్
ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో మైదానంలో వెక్కివెక్కి ఏడ్చాడు. తన కెరీర్లో కనీసం ఒక్క ప్రపంచకప్ అయినా సాధించాలనుకున్న ఈ సాకర్ సూపర్ స్టార్ కల చెదిరింది. ఖతార్ వేదికగా తాజాగా మొరాకోతో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో 1-0 తేడాతో పోర్చుగల్ ఓటిమి పాలయ్యింది. దానితో బాధతో ఇంటికి పయనమైంది.
Cristiano Ronaldo: ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో మైదానంలో వెక్కివెక్కి ఏడ్చాడు. తన కెరీర్లో కనీసం ఒక్క ప్రపంచకప్ అయినా సాధించాలనుకున్న ఈ సాకర్ సూపర్ స్టార్ కల చెదిరింది. ఖతార్ వేదికగా తాజాగా మొరాకోతో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో 1-0 తేడాతో పోర్చుగల్ ఓటిమి పాలయ్యింది. దానితో బాధతో ఇంటికి పయనమైంది.
37 ఏళ్ల రొనాల్డో మరో ప్రపంచకప్ ఆడే అవకాశాలు దాదాపు లేనట్టే. ఈ మ్యాచ్ ఓటమితో ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైన రొనాల్డో మైదానంలో కుప్పకూలి చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్చాడు. అతనితో పాటు మైదానంలో ప్రేక్షకులు సైతం కన్నీరు పెట్టుకున్నారు. రొనాల్డో కన్నీరు తుడుచుకొంటూ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళుతున్న చిత్రాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత గొప్ప ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న రొనాల్డో కెరీర్లో వరల్డ్‌కప్ ఓ లోటుగానే మిగిలిపోయింది. ఇప్పటి వరకు పోర్చుగల్ తరఫున 195 మ్యాచ్‌లు ఆడిన రొనాల్డో 118 గోల్స్ చేశాడు.
The end of the story
Ronaldo 💔💔
#CR7𓃵 pic.twitter.com/EIvSqBnhWW— Adel (@iAdeeeeel) December 10, 2022
prchugal
ఇక ఇదిలా ఉంటే పొర్చుగల్ నాకౌట్ రౌండ్ మ్యాచ్‌ల్లో రొనాల్డోను జట్టు కోచ్ శాంటోస్ 50 నిమిషాల పాటు బెంచ్‌కే పరిమితం చేశాడు. కాగా ఈ కీలక మ్యాచ్ లో సాకర్ దిగ్గజాన్ని బెంచ్ కే పరిమితం చేయడంపై కోచ్ పై పలు విమర్శలు వెల్లువెత్తున్నాయి. అతని స్థానంలో కేవలం సబ్‌స్టిట్యూట్ ఆటగాడిగానే మైదానంలోకి దింపడం వివాదాస్పదంగా మారింది. మ్యాచ్ 50 నిమిషాలు గడిచిన తర్వాత మైదానంలోకి దిగిన రొనాల్డో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. రొనాల్డోను రిజర్వు బెంచ్‌కు పరిమితం చేయడాన్ని శాంటోస్ సమర్థించుకొన్నాడు.
Very sad to see @Cristiano in tears as his dream of winning the World Cup ended. Those mocking him should remember what he’s done for football. For me, he’s the 🐐- and a great guy who’s had the toughest year of his life on & off the pitch. He’s earned our respect. pic.twitter.com/CCH8ggHkTv
— Piers Morgan (@piersmorgan) December 10, 2022
‘‘నేనం బాధపడటం లేదు. నేను ఏమీ మార్చలేను. స్విట్జర్లాండ్‌పై అద్భుతంగా ఆడిన జట్టునే బరిలోకి దింపాను. రొనాల్డో విషయంలో తీసుకొన్న కఠిన నిర్ణయం వ్యూహాత్మకమైంది. జట్టు విషయంలో మనసుతోకాదు.. మెదడుతో ఆలోచించాను. అలాగని రొనాల్డో గొప్ప ఆటగాడు కాకుండా పోడు. కానీ కొన్ని సందర్భాల్లో ఫుట్‌బాల్ మ్యాచ్‌ల్లో అదృష్టం కూడా కలిసి రావాలి’’ అని పేర్కొన్నాడు. ఇక పోర్చుగల్ మ్యాచ్ ఓటమితో పలువురు అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఫిఫా ప్రపంచకప్ లో మెరిసిన మెస్సీ.. సూపర్ గోల్స్ తో సెమీస్ చేరిన అర్జెంటీనా..!