Workplace harassment: ప్రతి ఐదుగురు మహిళాఉద్యోగుల్లో ఒకరికి మానసిక వేధింపులు..
ప్రపంచవ్యాప్తంగా మహిళా ఉద్యోగులు పలు రకాల వేధింపులకు గురువుతుంటారు. ప్రధానంగా లైంగిక వేధింపులు ఎక్కువగా ఉంటాయని భావిస్తుంటారు.
Workplace harassment: ప్రపంచవ్యాప్తంగా మహిళా ఉద్యోగులు పలు రకాల వేధింపులకు గురువుతుంటారు. ప్రధానంగా లైంగిక వేధింపులు ఎక్కువగా ఉంటాయని భావిస్తుంటారు. బాస్ వేధించాడనో.. లేదా సహచరుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడోనని తరచూ వింటూ ఉంటాం. అయితే తాజాగా అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్, లాయిడ్స్ రిజిష్టర్ ఫౌండేషన్, గ్యాలెప్లు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో… ప్రపంచంలోని ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు మానసిక వేధింపులకు గురువుతున్నారని తేల్చి చెప్పింది. లైంగిక వేధింపులు, శారీరక వేధింపులకన్నా.. మానసిక వేధింపులకే ఎక్కువగా గురవుతున్నారని తాజా నివేదికలో పేర్కొంది.
తాము పనిచేసే కార్యాలయాల్లో మానసిక వేధింపులకు గురవుతున్నామని పలువురు మహిళలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 583 మిలియన్ మహిళలు ఏదో ఒక రకమైన వేధింపులకు… అంటే అవమానాలకు గురి కావడమో, లేదా బెదిరింపులకు గురి కావడమో. లేదా ఆధిపత్యం జాడ్యానికి గురి కావడమో జరుగుతోంది. ఈ లెక్కన చూస్తే 17.9 శాతం మంది మానసిక వేధింపులకు గురైనట్లు తెలుతోంది. ఇక మహిళల లైంగిక వేధింపుల విషయానికి వస్తే ప్రతి 15 మందిలో ఒకరు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. అంటే 6.3 శాతం మంది మహిళలు లైంగిక వేధింపులకు గురైనట్లు లెక్క. ప్రపంచవ్యాప్తంగా 205 మిలియన్ మహిళా ఉద్యోగులు ఏదో ఒక సందర్భంలో సహచర ఉద్యోగి తాకరాని చోట్ల తాకాడని. లేదా సెక్యువల్ కామెంట్లు చేశాడని, ఫోటోలు తీశాడని… ఈ మెయిల్స్ పంపాడని..లేదా సెక్సువల్ రిక్వెస్టులు చేయడం జరిగిందన్న ఫిర్యాదులు అందాయి. అయితే మహిళలు లైంగిక వేధింపుల కంటే మానసిక వేధింపులకే ఎక్కువగా గురువుతున్నారు. కాగా మహిళల కంటే పురుషులే మానసిక వేధింపులకు గురువుతుంటారని సర్వేతో తేలింది.
శారీర దాడుల విషయానికి వస్తే చాలా ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. 277 మిలియన్లు లేదా 8.5 శాతం మంది మహిళా ఉద్యోగులు తిట్లు తినడంతో పాటు దెబ్బలు తిన్న సందర్భాలున్నాయి. కొంత మంది మహిళలపై ఉమ్మివేసిన సందర్బాలున్నాయి. అయితే ఇది ఇటు మహిళలు, అటు పురుషులు కూడా ఈ వివక్షను ఎదుర్కొంటున్నారు. మహిళల కంటే పురుషులే ఎక్కువగా శారీరక హింసకు గురవుతున్నారు. అయితే ఈ వేధింపులకు గురవుతున్న వారి విషయానికి ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ జాఢ్యం ఎక్కువగా ఉంటోంది. వయసులో ఉన్న యువతి, వలస వచ్చిన వారు.. వేతనాల్లో అసమాన్యతతో పాటు లైంగిక వేధింపులకు ఎక్కువగా గురవుతుంటారు. ఉద్యోగాలు చేస్తున్న మహిళలు పెద్ద ఎత్తున లైంగిక వేధింపులకు గురైనా.. ఇద్దరిలో ఒకరు లేదా 54.4 శాతం మంది మాత్రమే తమకు జరిగిన చేదు అనుభవాలను మిత్రులతో కానీ కుటుంబసభ్యులతో పంచుకుంటుంటారు.
ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంచనా ప్రకారం తమకు జరిగిన లైంగిక వేధింపులు బహిరంగంగా చెబితే పరువు పోతోందని భయంతో పాటు ఫిర్యాదు చేయాలన్న ఆలోచన రాకపోవడం.. దీంతో పాటు తనకు జరిగిన అన్యాయం గురించి పోరాడుదామంటే.. సహచరుల నుంచి ప్రోత్సాహం ఉండదు. అనవసరంగా కెలిక్కున్నట్లు అవుతుంది. టైం దండగ అని నిరుత్సాహ పరుస్తుంటారని ఐఎల్ఓ నివేదికలో పేర్కొంది.
ఇదిలా ఉండగా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఈ జాడ్యాన్ని రూపు మాపేందుకు కొన్ని సిఫార్సులు చేసింది. మహిళా ఉద్యోగులు వేధింపులకు గురి కాకుండా యాజమాన్యం గట్టి చర్యలు తీసుకోవడమే కాకుండా.. వారిలో అవగాహన కల్పించాలని సూచించింది. ఫిర్యాదు అందిన వెంటనే దానికి తగ్గట్టు వెంటనే గట్టి చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రతి కార్యాలయం ఒక ఫ్రేం వర్క్‌ను తయారు చేసి కార్యాలయాల్లో వేధింపులకు పాల్పడే వారికి ఎలాంటి శిక్షలు ఉంటాయో ఉద్యోగులకు స్పష్టంగా తెలియజేస్తే… మహిళలు స్వేచ్చగా ఉత్సాహంగా తమ ఉద్యోగాలు చేసుకొనే అవకాశం ఉంటుందని నివేదికలో పేర్కొంది.