Home / తాజా వార్తలు
తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ''తొలి ఏకాదశిగా'' గా పిలుస్తారు. దీనికే ''శయనైకాదశి'' అని ''హరి వాసరమని'' పేరు.
బ్రిటన్ ఆర్థికమంత్రి రిషి సునాక్ రాజీనామాతో మొదలైన రాజీనామాల పర్వం క్రమంగా పెరుగుతూపోయి 54 మంత్రుల రాజీనామా వరకు వెళ్లింది. దీతో బోరిస్ రాజీనామా అనివార్యమైంది. అయితే బోరిస్ స్థానంలో కొత్త ప్రధానమంత్రి ఎవరు అనే చర్చ అప్పుడే మొదలైంది.
అమర్నాథ్ యాత్రికులపై ప్రకృతి కన్నెర్ర చేసింది. చుట్టూ ఉన్న కొండల్లోంచి ఆకస్మికంగా పోటెత్తిన వరద అమరనాథుడి గుహ ఎదుటే వాగులో సేదదీరుతున్న భక్తులపై అమాంతం వచ్చిపడింది.
ఆంధ్రప్రదేశ్‌లో పండుగ వాతావరణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు సాగుతున్నాయి. తొలిరోజు అత్యంత ఉత్సాహవంతమైన వాతావరణంలో ఫుల్ జోష్‌లో ఈ సమావేశాలు సాగాయి.
ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో కోస్తాలో ముసురు వాతావరణం నెలకొంది. ఈదురు గాలులతోపాటు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్యలో రాష్ట్రంలోనే అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా రణస్థలం
Narendra Modi Wishes to Dalai Lama: ప్రముఖ ఆధ్మాత్మిక గురువు దలైలామాకు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంపై చైనా చేసిన విమర్శలను భారత్ దీటుగా తిప్పికొట్టింది. దలైలామా భారత్‌లో గౌరవ అతిథి అని, ఆయనకు భారత్‌లోనూ అనుచరులు ఉన్నారని భారత విదేశాంగ శాఖ స్పష్టంచేసింది. గతేడాది కూడా దలైలామాకు మోదీ శుభాకాంక్షలు చెప్పినట్టు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి గుర్తు చేశారు. ఆయన మత గురువు అని వారి మతపరమైన […]
Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ఇల్లందు పరిధిలోని సింగరేణి గనుల్లో భారీగా వరద నీరు నిలుస్తోంది. దీంతో సింగరేణికి తీవ్ర నష్టం కలుగుతోంది. ఇల్లందు కోయగూడెం ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. కోయగూడెం ఉపరితల గనిలో 187 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా 9కోట్ల గ్యాలన్ల నీరు క్వారీలోకి చేరింది. వరుసగా మూడు రోజులు ఇల్లందు టేకులపల్లి […]
MLA Raja Singh Escaped from Amarnath Yatra: అమర్నాథ్ యాత్రలో పోటెత్తిన వరద కారణంగా 15 మంది ప్రాణాలు కోల్పోగా, 40 మంది దాకా గల్లంతైనట్లు సమాచారం. అమర్నాథ్ యాత్రకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన కుటుంబంతో కలిసి వెళ్లారు. ఆయన, తన కుటుంబం అంతా క్షేమంగా ఉన్నట్లు రాజాసింగ్ ఓ వీడియో విడుదల చేశారు. వారిని అక్కడి పోలీసులు సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలిపారు. ఇటీవల తన కుమార్తె వివాహం జరిగడంతో కుమార్తె, అల్లుడితో […]
Covid-19 Second Booster Dose: కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌ల నిర్వహణకు ఉన్న గ్యాప్‌ను కేంద్రం బుధవారం 9 నెలలు లేదా 39 వారాల నుంచి 6 నెలలు లేదా 26 వారాలకు తగ్గించింది. 18-59 సంవత్సరాల మధ్య ఉన్న లబ్దిదారులందరికీ 2వ డోస్ ఇచ్చిన తేదీ నుండి 6 నెలలు లేదా 26 వారాలు పూర్తయిన తర్వాత బూస్టర్‌ను అందించాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ […]
Janasena Leader Nagababu Criticizes CM Jagan: జగన్ సర్కారు పై జనసేన విమర్శల దాడిని పెంచుతోంది. నవరత్నాలపై నవసందేహాలంటూ ప్లీనరీ రోజునే వైసీపీని పవన్ టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నాగబాబు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అమ్మ ఒడి తప్పించుకోవడానికే ముద్దుల మావయ్య స్కూళ్లను మూసివేస్తున్నారని నాగబాబు ఆరోపించారు. స్కూళ్లను మూసివేయడం ద్వారా భావి భారత పౌరుల భవిష్యత్తును అగమ్య గోచరంగా మార్చివేస్తున్నారని ఆవేదన […]