Home / తెలంగాణ
రైతు గాఢ నిద్రలోకి జారుకున్నాక..గాలికి చలిమంట ఉవ్వెత్తున ఎగిసి పాకకు అంటుకున్నాయి.ఆ క్షణాల్లోనే మంటలు పాక మెుత్తం వ్యాపించాయి.చుట్టూ పక్కల ఎవరు లేకపోవడంతో బయటకు రాలేకపోయిన రైతు భూమన్న అక్కడిడక్కడే కాలి బూడిదైపోయాడు.
మునుగోడు ఉప ఎన్నికకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రజల కష్టాలను అసెంబ్లీ వేదికగా కొట్లాడకుండా, రాజీనామ చేసి తిరిగి ఎన్నికకు కారకుడైన కోమటిరెడ్డి తిరిగి ఏం పొడుస్తాడని రేవంత్ దుయ్యబట్టారు
ఆందోల్ నియోజకవర్గంలో ఆ ఇద్దరూ సీనియర్ రాజకీయ నాయకులే. నియోజకవర్గం ఓటర్ల పుణ్యమా అని ఒకరు డిప్యూటీ సీఎం హోదా.. మరొకరు మంత్రి హోదాను బాగా ఎంజాయ్ చేసినవారే.
అది తెలంగాణ ఉద్యమానికి ఊపిరినిచ్చిన ఉమ్మడి వరంగల్ జిల్లా. టీఆర్ఎస్కు మంచి పట్టు ఉన్న జిల్లా. అయితే.. ఆ జిల్లా నుంచి పలువురు నాయకులు టీఆర్ఎస్ను వీడటం చర్చనీయాంశంగా మారింది.
హవాలా నగదుకు లావాదేవీలకు దొంగ మార్గం. దీన్ని నిరోధించేందుకు నిత్యం ప్రభుత్వ వర్గాలు శ్రమిస్తుంటాయి. అయినా దొడ్డిదారిన హవాలా చేస్తున్న వ్యక్తులు కోకొల్లలు. తాజాగా హైదరాబాదులో రూ. 3.5 కోట్ల రూపాయల హవాలా నగదును పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు
ఈ నెల 16న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరీక్షకు సంబంధించిన కొన్ని నియమనిబంధనలను టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఒకరికి బదులు మరొకరు పరీక్షకు హాజరైతే వారిని శాశ్వతకాలం డీబార్ చేయనున్నట్టు పేర్కొనింది.
కాంగ్రెస్ పార్టీ నేత, ములుగు ఎమ్మెల్యే ధనిసిరి అనసూయ అలియాస్ సీతక్క ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ సంపాదించారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో గుత్తికోయ గిరిజనుల సామాజిక స్థితిగతుల పై అధ్యయనం చేసిన సీతక్క. ఆ అంశం పై పరిశోధనా పత్రాన్ని సమర్పించారు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టు రూపంలో దక్కించుకున్న రూ. 18 వేల కోట్లను మునుగోడు ప్రజల అభివృద్ధికి ఖర్చు చేస్తామని బీజేపీ ప్రభుత్వం హామీ ఇస్తే.... తాము మునుగోడు ఎన్నికల బరి నుంచి తప్పుకుంటామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
మునుగోడులో కొత్త ఓటు హక్కు, చిరునామా బదిలీల రూపంలో రికార్డు స్థాయిలో 25వేలకు పైగా దరాఖస్తులు చేసుకొన్నారు. ఇదంతా రాజకీయ దురుద్ధేశంతోనే ఇన్ని దరాఖాస్తులు నమోదు చేసుకొంటున్నారని భాజపా తెలంగాణ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
తెలంగాణా సర్కార్ పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యుత్ ఉద్యోగుల విభజన అంశంలో తెలంగాణ ప్రభుత్వ తీరును ఎండగట్టింది.