Last Updated:

Best Samsung Mobiles: మార్కెట్‌‌లో తోపు.. ఎక్కువ డిమాండ్ ఉన్న సామ్‌సంగ్ ఫోన్లు.. టాప్ -4లో ఇవే!

Best Samsung Mobiles: మార్కెట్‌‌లో తోపు.. ఎక్కువ డిమాండ్ ఉన్న సామ్‌సంగ్ ఫోన్లు.. టాప్ -4లో ఇవే!

Best Samsung Mobiles: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం సామ్‌సంగ్ భారతీయ మొబైల్ మార్కెట్‌లో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంది. కంపెనీ వివిధ ధరల్లో అనేక మొబైల్ వేరియంట్లను అందిస్తుంది. అందులో సామ్‌సంగ్ గెలాక్సీ ఏ, గెలాక్సీ ఎస్, గెలాక్సీ ఎమ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. లేటెస్ట్ మొబైల్స్‌లో కూడా మంచి మార్కెట్‌ను కలిగి ఉన్నాయి. సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్‌లో కొన్ని స్మార్ట్‌ఫోన్లు ముఖ్యంగా వాటి కెమెరా సెన్సార్‌లు, లాంగ్ బ్యాటరీ లైఫ్, ఆకర్షణీయమైన డిజైన్ కారణంగా వినియోగదారులను ఆకర్షించాయి. అయితే తాజాగా విడుదలైన గెలాక్సీ ఎస్ 24 సిరీస్‌ ఊహించని సక్సెస్ అందుకుంది. ఈ నేపథ్యంలో సామ్‌‌సంగ్‌ బ్రాండ్‌లో ఉన్న బెస్ట్ మొబైల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Samsung Galaxy S24 Ultra
ఈ సామ్‌సంగ్ మొబైల్‌‌లో 6.8 అంగుళాల డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే ఉంది. ఇది Snapdragon 8 Gen 3 SoC ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఇది క్వాడ్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంది. దీనిలో మొదటి కెమెరా 200 మెగాపిక్సెల్ సెన్సార్‌. ఇది 5,000mAh కెపాసిటీ బ్యాటరీ బ్యాకప్‌ను కలిగి ఉంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది.

Samsung Galaxy S24 FE
ఈ స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల FHD+ ఇన్ఫినిటీ O డైనమిక్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది Samsung Xclipse 940 GPUతో పాటు Exynos 2400e 4nm ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంది. దీనిలో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌ ఉంది. దీనిలో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సెన్సార్‌తో పాటు 4,700mAh బ్యాటరీ ఉంటుంది.

Samsung Galaxy A35 5G
ఈఫోన్ 1080 × 2340 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల పూర్తి HD ప్లస్ సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది Mali G68 GPU సపోర్ట్‌తో పాటు Exynos 1380 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను కూడా ఉంది. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో పాటు ప్రైమరీ కెమెరా 50 మెగా పిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంది.

Samsung Galaxy A55 5G
ఈ స్మార్ట్‌ఫోన్ 1,080×2,408 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది.ఇది Exynos 1480 SoC ప్రాసెసర్ పవర్‌లో పని చేస్తుంది. ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సెన్సార్‌ ఉంది. ఇందులో 5,000mAh కెపాసిటీ ఉన్న బ్యాటరీ కూడా ఉంది. ఇది 25W ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి

96870

ఇవి కూడా చదవండి: