Home / Kamal Haasan
కళాతపస్వి దర్శకుడు కె.విశ్వనాథ్‌ను నటుడు కమల్‌హాసన్ కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. కమల్ హాసన్ కే విశ్వనాథ్ చేయి పట్టుకుని ఆత్మీయంగా పలుకరిస్తున్న ఫొటో ఇపుడు ట్రెండింగ్ అవుతోంది.కమల్ హాసన్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో విశ్వనాథ్ ఆశీర్వాదం తీసుకుంటున్న చిత్రాన్ని పోస్ట్ చేసారు.
సినిమా ఇండస్ట్రీలో వారిద్దరి ప్రతిభ, ప్రేక్షకుల్లో కేక పెట్టించింది. విలక్షణమైన నటనలతో సొంతం చేసుకొన్నవారు ఒకరైతే, విమర్శకులను సైతం మెప్పించే డైరెక్షన్ కల్గిన చాతుర్యం మరొకరిది.
కమల్, శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్-2’ సినిమా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై ప్రేక్షకులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో మరో ఇంట్రెస్టింగ్ అంశం యాడ్ అయ్యింది. భారత మాజీ క్రికెటర్ యవరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ ఈ మూవీలో ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడు.
లోకనాయకుడు కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ మూవీ షూటింగ్లో బిజీబిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కమల్ గుక్కతిప్పకండా 10నిమిషాల నిడివి ఉన్న ఓ డైలాగ్ ను సింగిల్ షాట్ లో చెప్పేసారంట.
హీరో సూర్య ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ నేపథ్యంలో క్రేజీ ప్రాజెక్ట్ రాబోతుందంటూ సినీవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా ఈ చిత్రాన్ని 1000కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించేందుకు శంకర్ సన్నాహాలు చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కెరీయర్లో బెస్ట్ మూవీస్‌లో ఇండియన్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా విడుదలై ఇప్పటికి 21 సంవత్సరాలు అవుతుంది. కానీ ఆ సినిమా గుర్తులు, జ్ఞాపకాలు మాత్రం ఇప్పటికి చేరిగిపోలేదు. అవి ఇప్పటికి కూడా తగ్గలేదంటే అతిశయోక్తి కాదు.