Home / iraq
ఇరాక్‌లోని అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా క్షిపణి దాడులు జరిగాయి. కార్యాలయం కాంపౌండ్ లోపల సుమారు ఏడు మోర్టర్ రౌండ్లు పడ్డాయని అమెరికా మిలిటరీ అధికారులు వెల్లడించారు. ఇరాక్‌లో ఈ మధ్య కాలంలో అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా జరిగిన అతిపెద్ద దాడిగా ఈ క్షిపణి దాడిని అభివర్ణించారు.
ఇరాక్‌లోని ఉత్తర నగరమైన ఎర్బిల్‌కు సమీపంలో ఉన్న యూనివర్శిటీ డార్మిటరీలో మంటలు చెలరేగడంతో 14 మంది మరణించగా, 18 మంది గాయపడ్డారు. ఎర్బిల్‌కు తూర్పున ఉన్న సోరన్ అనే చిన్న నగరంలోని ఒక భవనంలో మంటలు చెలరేగాయని సోరన్ హెల్త్ డైరెక్టరేట్ హెడ్ కమరం ముల్లా మహమ్మద్ తెలిపారు.
తూర్పు ఇరాక్‌లోని దియాలా ప్రావిన్స్‌లో గుర్తుతెలియని ముష్కరులు బాంబులతో దాడి చేయడంతో కనీసం 11 మంది మరణించినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. దాడికి బాధ్యులమని ఏ గ్రూపు వెంటనే ప్రకటించలేదు.
పాకిస్థాన్ భారత్ కు ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తుందని తెలిసిన విషయమే. అదేవిధంగా పాక్ చైనాకు గాడిదలను ఎగుమతి చేస్తుంది. ఇపుడు తాజాగా పాకిస్తాన్ ఎగుమతుల జాబితాలో బిచ్చగాళ్లు చేరారు. అవును.. సౌదీ అరేబియా మరియు ఇరాక్ వంటి దేశాలు ఇప్పుడు బిచ్చగాళ్ల ప్రవాహాన్ని అరికట్టాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరడంతో ఇది వెలుగులోకి వచ్చింది.
ఇరాక్‌లోని ఒక ఫంక్షన్ హాల్లో వివాహం సందర్బంగా జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 100 మందికి పైగా మరణించగా 150 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించారు.
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో శుక్రవారం (సెప్టెంబర్ 1) అర్థరాత్రి రెండు మినీ బస్సులు ఢీకొన్న ప్రమాదంలో పద్దెనిమిది మంది మరణించారు. దుజైల్ మరియు సమర్రా మధ్య ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియాను ఉటంకిస్తూ వార్తా సంస్థ నివేదించింది. సలాహెద్దీన్ ప్రావిన్స్‌లోని వైద్య అధికారి మినీ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయని చెప్పారు.
కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐసిస్ చీఫ్ అబు హసన్ అల్-హషిమి అల్-ఖురేషీ మరణించాడు. ఈ మేరకు ఐసిస్ ఉగ్రవాద సంస్థ ఓ ఆడియో ద్వారా ప్రకటించింది.