Home / ap govt
AP Govt initiative Ayyappa Devotees: కూటమి ప్రభుత్వం చొరవతో కేరళలో చిక్కుకున్న అయ్యప్ప భక్తులు క్షేమంగా దర్శనానికి వెళ్లారు. నెల్లూరు నియోజకవర్గ పరిధి వెదురుకుప్పం మండలం గొడుగుచింత గ్రామానికి చెందిన అయ్యప్ప భక్తులు శబరిమల యాత్రకు కేరళ వెళ్లారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో వారికి రోడ్డు ప్రమాదం జరగడంతో కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై తమ తప్పు లేకున్నా కేరళ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారని, దర్శనం ఉందని చెబుతున్నా సహకరించడం లేదని ఆవేదన […]
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించే ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వై ప్లస్ కేటగిరీ భద్రతను కేటాయించింది. వై ప్లస్ భద్రత కల్పించడంతో పాటు పవన్ కళ్యాణ్ కోసం ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది.
ఆంధ్రప్రదేశ్ లో 42 రోజులనుంచి సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ప్రజాస్వామ్య బద్దంగా లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. నామమాత్రపు వేతనాలతో సేవలందిస్తున్న మహిళలతో సామరస్యపూర్వకంగా చర్చలు జరపకుండా విధులనుంచి తొలగించాలని ఆదేశాలు ఇవ్వడం, పోలీసు చర్యలకు దిగడం పాలకుల ధోరణిని తెలియజేస్తోందన్నారు.
కృష్ణా డెల్టాలో ఎండిపోతున్న పంటలు చూసినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రికి ప్రణాళిక లేకపోవటం వల్లే రాష్ట్రంలో పంటలకు సాగునీరు అందక ఎండిపోతున్నాయని గుంటూరులో నిర్వహించిన కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అమరావతి R5 జోన్ నిర్ణయంపై ఏపీ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. R5 జోన్‌పై రైతుల పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. R5 జోన్ లో ఇళ్ల స్థలాలను పేదలకు కేటాయించటంపై జారీ చేసిన జీవో నెంబర్ 45పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని రైతులు పిటిషన్ వేశారు. అయితే.. జీవో నెంబర్ 45పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్లకు మంత్రి పినిపే విశ్వరూప్ శుభవార్త చెప్పారు. గ్రామ వాలంటీర్లకు రూ.15 వేల జీతం ఇవ్వనున్నట్లు తెలిపారు.
మాండూస్ తుఫాను ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంత వాసులను తీవ్ర భయబ్రాంతులకు గురిచేసింది. కాగా నేడు మాండూస్ బలహీనపడి అల్పపీడనంగా మారింది. తుఫాను ప్రభావంతో అనేక ప్రాంతాలు జలదిగ్భంతో చిక్కుకుని ఉన్నాయి. భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. చాలా మంది లోతట్టు ప్రాంత ప్రజలు నిరాశ్రయులయ్యారు. కాగా తుఫాను కారణంగా నిరాశ్రయులైన బాధితులకు ఆర్థిక సాయం విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో మెనూ మారనుంది. ప్రస్తుతం పాఠశాలల్లో అమలు చేస్తున్న జగనన్న గోరుముద్ద పథకం మధ్యాహ్న భోజనంలో మార్పులు చేశారు. జగనన్న గోరుముద్ద పథకంలో నేటి నుంచి కొత్త మెనూను అమలు కానుంది.
ఇప్పటికే అప్పుల ఊబిలో చిక్కుకుని తేలలేకపోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాజాగా మరోమారు కొత్త రుణాన్ని సేకరించింది. తాజాగా మంగళవారం నాడు రూ.1,413 కోట్ల అప్పును తీసుకుంది.