Site icon Prime9

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఎమ్మెల్సీ కవిత వాంగ్మూలం రికార్డ్ చేయనున్న సీబీఐ అధికారులు

cbi-to-record-mlc kavita-statement-today-in-delhi-liquor-case

cbi-to-record-mlc kavita-statement-today-in-delhi-liquor-case

MLC Kavitha: ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవితను ఇవాళ ఉదయం 11గంటలకు హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో సీబీఐ విచారించనుంది. ఇప్పటికే కవిత ఇంటి వద్దకు చేరుకున్న సీబీఐ అధికారులు ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నారు.

కాగా శనివారం నాడు ప్రగతిభవన్ కు వెళ్లిన కవిత సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. మంత్రి మండలి ముగిసిన తరువాత ఆమె కేసీఆర్ తో సీబీఐ విచారణకు సంబంధించి పలు విషయాలపై చర్చించినట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో డిసెంబర్ 6వ తేదీనే సీబీఐ అధికారులు కవిత వాగ్మూలం తీసుకోవాల్సి ఉండగా.. ఆ రోజు తనకు అనేక కార్యక్రమాలు ఉన్నాయని తనకు ఆ రోజు తనకు వీలుకాదని తెలిపారు. ఈ మేరకు సీబీఐకు లేఖ రాశారు. 6వ తేదీన ముందే నిర్దేశించుకున్న షెడ్యూల్ కారణంగా నేను సీబీఐ విచారణకు హాజరుకాలేనని, ఈనెల 11, 12, 14, 15 తేదీల్లో ఎప్పుడైనా సీబీఐ అధికారులు తన వాగ్మూలం తీసుకోవచ్చునని కవిత సీబీఐకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు 11న హైదరాబాద్ లోని కవిత నివాసంలోనే ఆమె వాగ్మూలం తీసుకుంటామని సీబీఐ తెలిపిన విషయం విధితమే. దీంతో నేడు సీబీఐ అధికారులు కవిత నివాసానికి వెళ్లి ఢిల్లీ మద్యం కేసు విషయంలో ఆమె వాగ్మూలం తీసుకోనున్నారు.

ఇకపోతే సీబీఐ అధికారులు తన వాగ్మూలం తీసుకొనేందుకు హైదరాబాద్లోని నివాసానికి వస్తున్న క్రమంలో కార్యకర్తలెవరూ తన ఇంటి వద్దకు రావొద్దని కవిత కోరినట్లు తెలుస్తోంది. దానితో కవిత ఇంటి పరిసరాలంతా చాలా నిర్మాణుష్యంగా ఉన్నాయి. ఇప్పటికే కవిత ఇంటిమార్గంలో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. కవిత నివాసం వద్ద బీఆర్ఎస్ నేతలు భారీగా ప్లెక్సీలు, హోర్డింగులు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. డాటర్ ఆఫ్ ఫైటర్ .. విల్ నెవర్ ఫియర్ ( యోధుని కుమార్తె.. ఎన్నటికీ భయపడదు), ‘వుయ్‌ ఆర్‌ విత్‌ యూ కవితక్కా..’ (మేము నీతో ఉన్నాం కవితక్కా..) అని వాటిపై రాశారు. మరి ఆ విచారణ ఏ విధంగా జరిగిందో తెలియాలంటే కవిత కానీ సీబీఐ అధికారులుకు కానీ వివరించేంతవరకు వేచి చూడాల్సిందే. అయితే సీబీఐ అధికారులకు తాను పూర్తిగా సహకరిస్తానని కవిత ఇదివరకే పేర్కొనింది.

ఇదీ చదవండి: కోమటిరెడ్డిని పక్కన పెట్టేసిన కాంగ్రెస్.. తెలంగాణ పీసీసీ కొత్త కమిటీల్లో దక్కని చోటు

Exit mobile version