Super Star Krishna Funerals: సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు బుధవారం ప్రభుత్వ లాంఛనాల నడుమ జూబ్లీ హిల్స్‌లోని మహాప్రస్థానంలో ముగిశాయి. మంగళవారం తెల్లవారు జామున గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కృష్ణ కన్నుమూశారు. దాంతో మంగళవారం నానక్‌రామ్‌గూడలోని కృష్ణ ఇంటి వద్ద పార్థీవదేహాన్ని సందర్శనార్థం ఉంచారు. ఈ రోజు ఉదయం అక్కడి నుంచి అభిమానుల సందర్శనార్థం పద్మాలయ స్టూడియోకి తరలించారు. మధ్యాహ్నం తర్వాత నటశేఖరుడి అంతమ యాత్ర ప్రారంభమైంది. అశేష జనవాహిని అశ్రునయనాల నుడుమ అనంతలోకాలకు పయమనమయ్యారు అభిమాన నటుడు. పద్మాలయ స్టూడియోస్ నుంచి ఆయన పార్థివదేహాన్ని జూబ్లీహిల్స్ మహా ప్రస్థానానికి అంతిమ యాత్ర కదిలింది.
ప్రభుత్వ లాంఛనాలతో జూబ్లీ హిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఆంధ్రా జేమ్స్‌బాండ్‌ను కడసారి చూసేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి అభిమానులు లక్షలాదిగా తరలివచ్చారు. కృష్ణకు వారి కుటుంబ ఆచారం ప్రకారం వైష్ణవ సాంప్రదాయంలో నుదుటిన వైష్ణవ నామం పెట్టారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులంతా కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌తో పాటు తెలంగాణ గవర్నర్ తమిళిసై కూడా కృష్ణ భౌతికకాయానికి అంజలి ఘటించారు. ఆయన కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.
ఇదీ చదవండి:ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ “సూపర్ స్టార్ కృష్ణ”