Site icon Prime9

Super Star Krishna: కళామ్మతల్లి ముద్దుబిడ్డ.. “సూపర్ స్టార్ కృష్ణ” ఇకలేరు

super star krishna passes away

super star krishna passes away

Super Star Krishna: తెలుగు ఇండస్ట్రీ నాట విషాధ ఛాయలు నెలకొన్నాయి. కళామ్మతల్లి ఒక్కసారిగా మూగబోయింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమ మరో పెద్ద దిక్కును కోల్పోయింది. వెండితెరపై నాలుగు దశాబ్ధాల పాటు సూపర్ స్టార్ గా వెలుగొంది.. తెలుగు సినీ ఖ్యాతిని ఖండాతరాలకు చాటి చెప్పిన హీరో కృష్ణ ఇకలేరు. గత కొంత కాలంగా శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారు జామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. సూపర్ స్టార్ కృష్ణ మృతితో ఘట్టమనేని కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆయన సొంతూరైన గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెంలో సైతం అంధకార చీకట్లు కమ్ముకున్నాయి.

తెలుగు సినీ ఇండస్ట్రీ సైతం ఆయన మరణ వార్త విని కన్నీరు పెట్టుకుంటుంది. ఈ లెజెండరీ హీరో, దర్శకుడు, నిర్మాతగా కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలందించారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన ఈయన సినీ కెరీర్‌లో 340 పైచిలుకు సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించాడు. కృష్ణ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తల్లి ఇందిరా దేవి మరణ వార్త నుంచి కోలుకోక ముందే తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణంతో మహేష్ బాబును కోలుకోలేని బాధలోకి నెట్టేసింది. ఈ సంత్సర కాలంలో మహేష్ ఇంట వరుసగా మూడు మరణాలు సంభవించడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ తీవ్రంగా బాధపడుతున్నారు. ఈ ఏడాది తొలినాళ్లలో మహేష్ అన్న రమేష్ బాబు మరణించగా ఇటీవల కాలంలో తల్లి ఇందిరాదేవి కాలం చెల్లించారు. కాగా తాజాగా మహేష్ తండ్రి అయిన సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు.

కృష్ణకు ఇద్దరు భార్యలు ఐదుగురు సంతానం. మొదటి భార్య ఇందిరా దేవి, రెండవ భార్య కథానాయిక నిర్మాత దర్శకురాలు అయిన విజయనిర్మల. కృష్ణ ఇందిరాదేవి దంపతులకు ఐదుగురు సంతానం రమేష్ బాబు, పద్మజ, మంజుల ఘట్టమనేని, మహేష్ బాబు, ప్రియదర్శిని.

ఇదీ చదవండి: ఆర్ఆర్ఆర్ చిత్రానికి సీక్వెల్ వచ్చేస్తుంది.. రాజమౌళి క్లారిటీ

Exit mobile version
Skip to toolbar