Site icon Prime9

Super Star Krishna: రేపే కృష్ణ అంత్యక్రియలు

was-krishna-wrote-a-will-to-denote-his-assets-to-whom-belongs

was-krishna-wrote-a-will-to-denote-his-assets-to-whom-belongs

Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ ఈ రోజు ఉదయం 4గంటల సమయంలో కన్నుమూశారు. కాగా ఆయన పార్థివదేహాన్ని నానక్ రామ్ గూడలోని మహేష్ ఇంట్లో కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సందర్శార్థం ఉంచారు. కాగా ఆయన పార్ధివ దేహానికి రేపు పంజాగుట్ట మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుపనున్నారు. అధికార లాంఛనాలతో తెలంగాణ ప్రభుత్వం కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనుంది. ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

అభిమానుల సందర్శనార్థం ఇవాళ సాయంత్రం కృష్ణ భౌతికకాయాన్ని గచ్చిబౌలి స్టేడియానికి తరలించనున్నారు. అనంతరం అక్కడి నుంచి రేపు ఉదయం పద్మాలయ స్టూడియోస్‌కు తరలిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం మహాప్రస్థానంలో ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు పూర్తి చేయనున్నట్లు కృష్ణ సోదరుడు, నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరి రావు తెలిపారు. మొదట్లో కృష్ణ అంత్యక్రియలు గురువారం జరుగనున్నట్టు ప్రచారం జరిగింది. కాగా ఆయన కుటుంబ సభ్యులు బుధవారమే అంత్యక్రియలు నిర్వహిస్తామని క్లారిటీ ఇచ్చారు.

ఇదీ చదవండి: ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ “సూపర్ స్టార్ కృష్ణ”

Exit mobile version