Site icon Prime9

Crackers Chocolates: ఈ టపాసులను ఎంచక్కా తినెయ్యొచ్చు..!

crackers chocolates

crackers chocolates

Crackers Chocolates: దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ నిర్వహించుకునే పండుగ దీపావళి. దీపావళి వస్తుందంటే చాలు చిన్నల నుంచి పెద్దల వరకు ఏఏ రకాల టపాసులు తెచ్చుకోవాలా అని చూస్తుంటారు. చిన్నాపెద్దా అంతా కలిసి పండుగ పటాకులు పేల్చి, చిచ్చుబుడ్లు వెలిగించి ఆనందంగా గడుపుతారు. అయితే ఈ పటాకులను చూస్తే మాత్రం కాల్చకుండా అమాంతం నోట్లో వేసుకుంటాం. అదేంటి టపాసులను నోట్లో వేసుకోవచ్చు అంటున్నారు.. పటాకులు విషపూరితం కదా అనుకుంటున్నారు కదా.. కాదండీ ఈ టపాసులు మాత్రం తియ్యతియ్యగా నోటిలో వేస్తే కరిగిపోతాయి. మరి వాటి విశేషాలేంటో తెలుసుకుందామా..

పర్యావరణ పరిరక్షణ కోసం బాణసంచా కాల్చకుండా దీపాలతో లేదా ఎకో ఫ్రెండ్లీ టపాసులతో పండుగను జరుపుకోవాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పింస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర పుణెలోని మూర్తీస్‌ బేకరీ యజమాని విక్రమ్‌ మూర్తి తన వంతుగా ప్రజలకు దీపావళి పండుగపై అవగాహణ కల్పిస్తున్నారు. బాణాసంచా కాల్చకుండా పండుగ జరుపుకోవాలనే కాన్సెప్ట్ తో వాటిని తినేవిధంగా చాక్లెట్‌ క్రాకర్స్‌ తయారు చేయడం ప్రారంభించారు. లక్ష్మీబాంబు, సుతిల్‌ బాంబు, చిచ్చుబుడ్లు, రాకెట్లు వంటి అన్ని రకాల టపాసుల ఆకృతుల్లో చాక్లెట్లు తయారు చేసి విక్రయించడం మొదలు పెట్టాడు. ఇలా టపాసుల ఆకారంలో ఉన్న ఈ టపాసు చాక్లెట్స్ ను చూస్తేనే నోరూరి పోతుందనుకోండి. మరి మీరు సే నో టూ క్రాకర్స్ అంటూ ఈ దీపావళిని సరదాగా ఆనందంగా ఈ మిఠాయిలతో జరుపుకోండి.

ఇదీ చదవండి: వందేళ్లకు ఒకసారి వచ్చే వెదురు బియ్యం… తిన్నోళ్లకు వందేళ్లు..!

Exit mobile version