Super Star Krishna: తెలుగు సినీపరిశ్రమలో ఆయన చేసిన సినిమాలు ఓ మైలురాయి. ఇప్పటి సినీలోకానికి ఆయన చేసిన ప్రయోగాలే మార్గనిర్ధేశాలు. 50 ఏళ్ల క్రితమే పాన్ వరల్డ్ సినిమా తీసిన లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ. ఈయన అద్భుత నటన గురించి ఈయన వ్యక్తిత్వం గురించి ఎంత వర్ణించినా అది తక్కువే. కాగా ఆ అందాల నటుడు అభిమాన తార నవంబర్ 15న కన్నుమూశారు. అయితే ఆయన మరణానంతరం అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన తన ఆస్తికి సంబంధించి రాసిన వీలునామా ఒకటి టాలీవుడ్ నాట విపరీతంగా ప్రచారం జరుగుతోంది.
కృష్ణ డబ్బుకు ఏనాడూ విలువ ఇవ్వలేని ఇండస్ట్రీ వర్గాల టాక్. వరుస హిట్స్ పడినా సరే అమాంతం రెమ్యూనరేషన్ పెంచేవారు కాదట. కృష్ణ తన ఫస్ట్ మూవీ తేనె మనసులుకు రూ. 2000 పారితోషకం తీసుకున్నారు. ఇకపోతే నిర్మాతల హీరోగా పేరు తెచ్చుకున్న కృష్ణ తన మూవీ ఫెయిల్యూర్ తో నష్టపోయిన నిర్మాతలను ఆదుకునే వారట. అదేవిధంగా రెమ్యూనరేషన్ తీసుకోకుండా మరో చిత్రం కూడా చేసి పెట్టేవారట. నిర్మాతగా మారిన తర్వాత ఆయన అనేక ప్రయోగాత్మక చిత్రాలు చేశారు. కొత్త జోనర్స్, రిస్క్ తో కూడిన సినిమాలను తీయడంతో ఆయనకు ఆయనే సాటి. ఇక ఈ కారణాలతో కృష్ణ సంపాదించిన మొత్తంలో చాలా వరకు కోల్పోయారు. అయినప్పటికీ కృష్ణ పేరిట చాలా ఆస్తి ఉందట. పద్మాలయ స్టూడియోతో పాటు ఆయన స్థిర, చర ఆస్తుల విలువ నాలుగు వందల కోట్లకు పైగా ఉన్నాయి. ఈ మొత్తాన్ని ఆయన మరణానంతరం ఎవరు అనుభవించాలనదే ఆయన ముందుగానే వీలునామా రాశారాట. ఈ వీలునామాలో కృష్ణ తన కొడుకులైన రమేష్, మహేష్ బాబుకు ఆస్తి రాయకుండా మనవళ్లు, మనవరాళ్లకు అనగా రమేష్ బాబు, మహేష్ బాబు కొడుకులు కుమార్తెలకు రాసేశారనేది టాలీవుడ్ టాక్. ఇక కూతుళ్ళకు కట్న కానుకల రూపంలో ముందుగానే ఇచ్చారట.
ఇదిలా ఉంటే తన రెండో భార్య విజయ నిర్మల కొడుకైన నరేష్ కి ఆయన ఏమీ ఇవ్వలేదని తెలుస్తుంది. అయితే నరేష్ కి తల్లి విజయనిర్మల ద్వారా పెద్ద మొత్తంలో ఆస్తి దక్కిందట. అందుకే ఆయన స్టెప్ ఫాదర్ అయిన కృష్ణ నుండి ఏమీ ఆశించలేదని ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంతో తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: మీరే నా హీరో.. మీరే నా బలం.. మంజుల ఘట్టమనేని ఎమోషనల్ పోస్ట్