Ram Charan-Upasana: తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ లవబుల్ కపుల్స్ లో రామ్ చరణ్, ఉపాసన కూడా ఒకరు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను పలు సందర్భాలలో వ్యక్తపరుస్తూనే ఉన్నారు. ఇక యితేవాల చాలా కాలం తర్వాత ఉపాసన గర్భవతి అయినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ వార్తతో మెగా ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి లో ఉన్నారు. ఇక ఇదే ఊపులో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో కూడా కలిసి పాల్గొంటూ సందడి చేస్తున్నారు ఈ జంట.
ఆర్ఆర్ఆర్ బెస్ట్ డైరెక్టర్
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “ఆర్ఆర్ఆర్” సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించారు. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. కేవలం భారత్ లోనే కాకుండా యూఎస్, జపాన్ లోనూ ఈ సినిమాకి బ్రహ్మరధం పడుతున్నారు. అలానే ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను కైవసం చేసుకుంటుంది. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ నుంచి ఇటీవలే బెస్ట్ డైరెక్టర్‌గా ఆర్ఆర్ఆర్ మూవీకి రాజమౌళి అందుకున్నారు. తాజాగా ఈ సినిమా మరోసారి చరిత్రను తిరగరాసింది.
నాటునాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు
ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుని అందుకుంది ఈ చిత్రం. ఈ సినిమాలోని నాటు నాటు పాటకి గాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుని ఈ పాట సంగీత దర్శకుడు కీరవాణి అందుకున్నారు. ఈ సందర్భంగా రెడ్ కార్పెట్ వేడుకకి ఎన్టీఆర్, రామ్ చరణ్(Ram Charan-Upasana), రాజమౌళి, కీరవాణి సతీ సమేతంగా వెళ్లారు. రెడ్ కార్పెట్ పై స్టైలిష్ లుక్స్ తో రామ్ చరణ్, ఉపాసన జంట అదరగొట్టారు. రామ్ చరణ్ నల్లటి షేర్వాణీ సెట్‌లో అదరగొట్టాడు. ఉపాసన శారీలో తళుక్కుమంది. ప్రస్తుతం వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కాగా ఈ అవార్డు వేడుకలో భాగంగా రామ్ చరణ్ మెడియాతో మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ సినిమా గురించి పలు విషయాలను చెబుతున్నారు. ఈ తరుణంలోనే సైలెంట్ గా ఉపాసన ఎంట్రీ ఇచ్చి చెర్రీని ఆశ్చర్య పరిచింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన రామ్ చరణ్ ఆ పాత్రికేయురాలితో ఈమె నా భార్య… అవార్డు వేడుక కోసం ఫ్యామిలీతో కలిసి వచ్చాను అని చెప్పడం ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇవి కూడా చదవండి…
RRR : గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో సత్తా చాటిన ఆర్ఆర్ఆర్.. బెస్ట్ సాంగ్ గా “నాటు నాటు”
Kantara: బిగ్ సర్‌ప్రైజ్.. ఆస్కార్‌కు క్వాలిఫై అయిన “కాంతారా”
Samantha: మీకు నాలాగ అవ్వకూడదంటూ.. వారికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన సమంత
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/