Gruhalakshmi: సెప్టెంబర్ 26 ఏపిసోడులో ప్రతి స్త్రీకి తులసి రోల్ మోడల్ అన్న సామ్రాట్
నేటి గృహలక్ష్మీ ఏపిసోడులో ఈ రెండు సీన్లు హైలెట్. మీడియా ముందు తులసి ఈ విధంగా మాట్లాడుతూ, తన గురించి చెప్తూ నేను ఒంటరి ఆడదాన్ని కాదు. సామ్రాట్ గారు అండగా నిలిచి తనని ప్రోత్సహిస్తున్నారని, తన కోసం మ్యూజిక్ స్కూల్ కూడా పెడుతున్నారని అంటుంది.
Gruhalakshmi Today: నేటి గృహలక్ష్మీ ఏపిసోడులో ఈ రెండు సీన్లు హైలెట్. మీడియా ముందు తులసి ఈ విధంగా మాట్లాడుతూ, తన గురించి చెప్తూ నేను ఒంటరి ఆడదాన్ని కాదు. సామ్రాట్ గారు అండగా నిలిచి తనని ప్రోత్సహిస్తున్నారని, తన కోసం మ్యూజిక్ స్కూల్ కూడా పెడుతున్నారని అంటుంది. మాకు తెలియక అడుగుతున్నాం ‘అసలు మేం చేసిన తప్పు ఏంటి అండి ? ఒక ఆడది ఇంకో మగాడి సాయం తీసుకుంటే ఇంక ఆ మగాడికి అమ్ముడుపోయినట్టేనా? ఇదెక్కడి అన్యాయం అండీ, అందరు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారని మళ్లీ స్వాతంత్య్రం దగ్గరకు వెళ్తుంది తులసి. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని ఏళ్ళు ఐనా ఆడది మాత్రం తన పవిత్రతను నిరూపించుకుంటూనే ఉండాలా? సమాజానికి సమాధానం చెప్తూనే ఉండాలా అని గట్టిగా అరిచి చెప్తుంది. ఇంకెంత కాలం ఒంటరి ఆడది ఇలా అవమానపడాలి ?సమాజంలో ఒంటరి ఆడవాళ్లను ఇలాగే అనుమానిస్తారా? నిలదీస్తారా? తన పిల్లలకు మంచి బుద్దులు నేర్పించే అమ్మ, తాను నీతి తప్పి ఎలా బ్రతుకుతుందని అనుకుంటున్నారు? ప్రతి మగాడికి రెండు చేతులు జోడించి మరి చెప్తున్నా ఆడదాన్ని గౌరవించండి. మీరు రాసే రాత వల్లే ఆడదాన్ని తలరాతని మారుతుందని తెలుసుకోండి.
ప్రతి స్త్రీకి తులసి రోల్ మోడల్..
తులసి మాటలన్ని విన్నాక మీడియా వారు సామ్రాట్‌కి క్షమాపణ చెప్తారు. అప్పుడు మన తులసి శాంతిస్తుంది. ఆ తరువాత మళ్ళీ సామ్రాట్ తులసి భజన మొదలు పెడతాడు. స్త్రీ శక్తికి మీరు రోల్ మోడల్ అంటూ తులసిని ఒక రేంజుకు ఎత్తేస్తాడు. ‘మీకు నేను ఎలా థాంక్స్ చెప్పాలో తెలీడం లేదంటాడు. తులసి గారూ, ప్రెస్ మీట్లో నేను మీకు అండగా ఉందాం అనుకున్నా. కానీ మీరే నాకు అండగా ఉన్నారు. స్త్రీ శక్తికి మీరు రోల్ మోడల్ అని తులసికి, సామ్రాట్ సెల్యూట్ చేస్తాడు. ఆ తరువాత భజన చేయడానికి వాళ్ళ కుటుంభ సభ్యులు కూడా అక్కడికి వస్తారు. తరువాత ఏమి జరగనుందో రేపటి ఏపిసోడులో తెలుసుకుందాం.