Site icon Prime9

Shah Rukh Khan: మాతా వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించి బాలీవుడ్ బాద్ షా “షారుఖ్ ఖాన్”

bollywood super star Shah Rukh Khan prayers at Mata Vaishno Devi temple in jammu kashmir

bollywood super star Shah Rukh Khan prayers at Mata Vaishno Devi temple in Jammu Kashmir

Shah Rukh Khan: బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందీ చలనచిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. కాగా ఈయన ఇటీవల కాలంలో వరుస సినిమాలతో బిజిబిజీగా గడుపుతున్నారు. అయితే మొన్నామధ్య తన నటిస్తున్న చిత్రం డుంకీ షూటింగ్ పూర్తి అయిన సందర్భంగా షారుక్  ఇటీవల మక్కాను సందర్శించి అక్కడి సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా శక్తిపీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న జమ్మూలోని మాతా వైష్ణో దేవి ఆలయాన్ని ఈ హీరో సందర్శించారు. ప్రస్తుతం వైష్ణో దేవి ఆలయం వద్ద ఎస్సార్కే ఉన్న ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

‘డుంకీ’ సినిమా ఇటీవల సౌదీ అరేబియాలో షూటింగ్ పూర్తి చేసిన తర్వాత ముస్లింల పవిత్ర నగరమైన మక్కాను షారూక్ సందర్శించారు. అంతే కాకుండా అక్కడ మక్కాలో ఉమ్రా చేస్తూ కనిపించాడు. దానితో ఆయన ఈ నెలలో దేశంలోని పవిత్ర స్థలాలను సందర్శిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే మాతా వైష్ణోదేవి ఆలయానికి ఆయన తన బాడీగార్డ్స్ తో కలిసి ఫుల్ గా కవర్ చేసి ఉన్న బ్లాక్ దుస్తులు ధరించి వెళుతూ కనిపించారు. జనావాసంలోనే సందుల గుండా వెళుతూ ఉండగా షారుక్ ను గుర్తించిన కొందరు అభిమానులు వీడియోను తీసి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

ఇదిలా ఉంటే మరికొందరు మాత్రం షారుఖ్ మతాచారాలకు అతీతంగా వ్యవహరించే వ్యక్తిగా.. అందరి దేవుళ్లను వారివారి సంప్రదాయాలను ఆయన గౌరవిస్తారని అందువల్లే మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లినట్టు చెప్తున్నారు. మరోవైపు తన కుమారు ఆర్యన్ ఖాన్ ఇటీవల సినిమా రంగంలోకి డెబ్యూ ఇస్తున్నట్టు అఫీసియల్ గా అనౌన్స్ చేశారు. కాగా తన కుమారుడి జీవితం ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తనపై గతంలో ఉన్న డ్రగ్స్ కేసులన్నీ రూపుమాసిపోవాలని మాతా వైష్ణోదేవి ఆలయానికి షారుఖ్ వెళ్లి పూజలు జరిపినట్టు కూడా టాక్ వినిపిస్తుంది. ఇంతకీ షారుఖ్ వైష్ణోదేవి ఆలయానికి వెళ్లడం వెనుకు రీజన్ ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు.

షారూక్ ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పఠాన్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో దీపికా పదుకొనే, జాన్ అబ్రహం, అశుతోష్ రానా మరియు సల్మాన్ ఖాన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో షారుఖ్ రా ఏజెంట్‌గా కనిపించనున్నారు. ‘పఠాన్’ జనవరి 25న విడుదల కానుంది. మరి షారుఖ్  వరుస ఆధ్యాత్మిక సందర్శనల వెనుక ఆంతర్యం ఏంటో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: ప్రభాస్‌ని బాలకృష్ణ ఏ ప్రశ్నలు అడగాలో మీరే చెప్పండి : ఆహా

Exit mobile version