Upcoming MPV Cars: లాంచ్‌కు రెడీ.. అదిరిపోయే కార్లు వస్తున్నాయ్.. ఈ అప్గ్రేడ్లు చూస్తే షాకవుతారు..!
Upcoming MPV Cars: గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ కస్టమర్లలో MPV విభాగానికి డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ప్రస్తుతం మారుతి సుజుకి ఎర్టిగా, టయోటా ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హైక్రాస్ వంటి SUVలు ఈ విభాగంలో బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే మీరు కూడా సమీప భవిష్యత్తులో కొత్త MPVని కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. మారుతీ, నిస్సాన్‌లకు చెందిన ప్రముఖ కార్ల తయారీదారులు తమ అనేక ఎమ్‌పివి మోడళ్లను భారత మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో లాంచ్ కానున్న అటువంటి 3 MPVల ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
Kia Carens Facelift
కియా ఇండియా తన పాపులర్ ఎమ్‌పివి కేరెన్స్‌కు త్వరలో మిడ్-లైఫ్ అప్డేట్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. కియా కేరెన్స్ ఫేస్‌లిఫ్ట్ వచ్చే ఏడాది ప్రారంభంలో అంటే 2025లో భారతీయ మార్కెట్లోకి ప్రవేశించనుంది. అప్డేట్గా కారుకు కొత్త ఫ్రంట్ ఫేసియా, అప్డేట్ చేసిన హెడ్‌ల్యాంప్, కనెక్ట్ చేసిన ఎల్ఈడీ డీఆర్ఎల్, రిఫ్రెష్ చేసిన ఫ్రంట్ బంపర్ ఉంటాయి. ఇది కాకుండా కారులో 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా, లెవల్-2 ADAS టెక్నాలజీని కూడా అందించవచ్చు.
Maruti Compact MPV
దేశంలోనే అతిపెద్ద కార్ల విక్రయ సంస్థ మారుతీ సుజుకి రానున్న రోజుల్లో కొత్త కాంపాక్ట్ ఎమ్‌పివిని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. రాబోయే మారుతి కాంపాక్ట్ MPV భారతీయ మార్కెట్లో రెనాల్ట్ ట్రైబర్‌తో నేరుగా పోటీ పడుతుంది. అనేక మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. ఇది YDB అనే కోడ్‌నేమ్‌తో బడ్జెట్ ఫ్రెండ్లీ MPVగా వస్తుంది.
New Nissan MPV
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ వచ్చే 3 ఏళ్లలో భారత మార్కెట్లో తన పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో కంపెనీ సరికొత్త కాంపాక్ట్ ఎమ్‌పివిని విడుదల చేయనుంది. రాబోయే నిస్సాన్ MPV రెనాల్ట్ ట్రైబర్‌తో ప్లాట్‌ఫామ్‌ను పంచుకోవచ్చని అనేక మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఇది కాకుండా రెండు MPVల పవర్‌ట్రెయిన్ కూడా ఒకేలా ఉండచ్చు.