Audi RS Q8: ఆడి క్యూ8 చూశారా.. లుక్ ఏముంది మామా.. ఒక్కసారి ఎక్కితేచాలు..!

Audi RS Q8: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి తన కొత్త ఆడి ఆర్ఎస్ క్యూ8 పెర్ఫార్మెన్స్ కారును ఈరోజు భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఈ కారులో శక్తివంతమైన ఇంజన్, అద్భుతమైన ఫీచర్లు కనిపిస్తాయి. భారతదేశపు ప్రసిద్ధ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈ కారును ఒక ఈవెంట్ సందర్భంగా విడుదల చేశారు. భారత్‌లో లాంబోర్గినీ ఉరస్, మెర్సిడెస్ బెంజ్, బిఎమ్‌డబ్ల్యూతో ప్రత్యక్ష పోటీ ఉంటుంది. కొత్త ఆడి ఆర్ఎస్ క్యూ8 ధర,ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
audi rs q8 price india
కొత్త ఆడి ఆర్ఎస్ క్యూ8 పెర్ఫార్మెన్స్ ఎక్స్-షోరూమ్ ధర రూ.2.49 కోట్లుగా ఉంది. ఈ వాహనం బుకింగ్స్ లాంచ్‌కు ముందే ప్రారంభమయ్యాయి. దీని కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మోడ్‌లో రూ. 5 లక్షలతో బుకింగ్ చేయచ్చు. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. ఇది రాబోయే 6 నెలలకు బుకింగ్‌లను పొందింది.
కొత్త ఆడి ఆర్ఎస్ క్యూ8లో 4.0-లీటర్, ట్విన్-టర్బో V8 ఇంజన్ అందించారు. ఈ ఇంజన్ 631బీహెచ్‌పి పవర్, 850ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వాహనంలో కంపెనీ 8 స్పీడ్ ట్రిప్‌ట్రానిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందించింది. ఇది కేవలం 3.6 సెకన్లలో గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 305 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఉంటుంది. ఈ కారులో అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్ అందించారు.
Audi RS Q8 Performance Features
కొత్త ఆడి ఆర్ఎస్ క్యూ8 ఫేస్‌లిఫ్ట్ డిజైన్‌లో కొన్ని మార్పులు ఉన్నాయి. ఇందులో ముదురు రంగు ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లను, ఎల్ఈడీ డీఆర్‌లతో కొత్త బ్లాక్-అవుట్ గ్రిల్‌ను పొందుతుంది. కారుకు స్పోర్టీ టచ్ ఇవ్వడానికి, బ్లాక్-అవుట్ 23-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఇందులో కనిపిస్తాయి. స్పోర్టీ ఫ్రంట్ సీట్లు,స్పోర్టీ స్టీరింగ్ వీల్‌తో సహా RS మోడల్‌ల మాదిరిగానే క్యాబిన్ కూడా అదే మార్పులను పొందుతుంది.
ఇందులో డ్యూయల్ స్క్రీన్ సెటప్ ఉంది. సెంట్రల్ కన్సోల్‌లో ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఫంక్షన్ కోసం డిస్‌ప్లే అందించారు. వర్చువల్ కాక్‌పిట్ గొప్ప గ్రాఫిక్స్‌తో అవసరమైన మొత్తం సమాచారాన్ని అందిస్తుంది. అలానే వైర్‌లెస్ ఛార్జింగ్, ఫోర్-జోన్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ టెయిల్‌గేట్‌తో వంటి ఫీచర్స్ ఉన్నాయి