Home /Author Thammella Kalyan
SRH: ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పరుగుల వరద పారింది. రెండు జట్లు.. 200పైగా స్కోర్లు చేశాయి. మెుత్తంగా 433 పరుగులు వచ్చాయి. ఇందులో 22 సిక్సర్లు, 39 ఫోర్లు ఉండగా.. ఓ సెంచరీ.. మూడు అర్ధశతకాలు నమోదయ్యాయి.
సన్ రైజర్స్ భారీ స్కోర్ సాధించింది. 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. హరీ బ్రూక్ సెంచరీతో చెలరేగాడు. 55 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. మక్రామ్ 50 పరుగులు చేయగా.. అభిషేక్ శర్మ 32 పరుగులతో రాణించాడు. కోల్ కతా బౌలర్లలో రస్సెల్ 3 వికెట్లు తీయగా.. చక్రవర్తి ఒక వికెట్ తీసుకున్నాడు.
సన్ రైజర్స్ బ్యాటర్లు చుక్కలు చూపిస్తున్నారు. 18 ఓవర్లకే జట్టు స్కోర్ 200 చేరింది. హరీ బ్రూక్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. అభిషేక్ శర్మ 16 బంతుల్లో 32 పరుగులు చేశాడు.
17 ఓవర్లు ముగిసేసరికి సన్ రైజర్స్ 172 పరుగులు చేసింది.
సన్ రైజర్స్ బ్యాటింగ్ లో దుమ్ములేపుతుంది. 15 ఓవర్లకు 157 పరుగులు చేసింది. హరీ బ్రూక్ చెలరేగిపోతున్నాడు. 43 బంతుల్లో 77 పరుగులు చేశాడు.
సన్ రైజర్స్ కెప్టెన్ మక్రామ్ విధ్వంసం సృష్టించాడు. 26 బంతుల్లో 50 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇందులో 5సిక్సులు, 2 ఫోర్లు ఉన్నాయి.
12 ఓవర్లో 16 వచ్చాయి. యూషాష్ వేసిన బౌలింగ్ లో మక్రామ్ రెండు సిక్సులు, ఓ ఫోర్ కొట్టాడు. దీంతో మెుత్తం 16 పరుగులు వచ్చాయి.
హరీ బ్రూక్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 32 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి.
10 ఓవర్లు ముగిసేసరికి సన్ రైజర్స్ 94 పరుగులు చేసింది. యూషాష్ వేసిన బౌలింగ్ లో చివరి బంతికి మక్రామ్ సిక్స్ బాదాడు.
రస్సెల్ వేసిన ఏడో ఓవర్లో.. 10 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్లో మక్రామ్ భారీ సిక్సర్ బాదాడు. సన్ రైజర్స్ 75 పరుగులు చేసింది.