Site icon Prime9

#WeDontWantTheriRemake: భవదీయుడు భగత్ సింగ్ తమిళ రీమేక్ సినిమానా? తేరీ రీమేక్ వద్దంటూ ట్విట్టర్ ట్రెండ్ .. రియాక్టయిన హరీష్ శంకర్

WeDontWantTheriRemake hash tag trending in social media for harish shankar and pawan kalyan movie

WeDontWantTheriRemake hash tag trending in social media for harish shankar and pawan kalyan movie

#WeDontWantTheriRemake: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. బాక్సాఫీస్ లు ఈయన సినిమాతో కళకళలాడుతాయి. అంతటి క్రేజ్ ఉన్న పవన్ తో సినిమా చేసేందుకు దర్శక, నిర్మాతలు కూడా ఎప్పుడూ రెడీగా ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఎక్కువ రీమేక్ సినిమాలే చేస్తుండడం చూస్తున్నాం. హిందీలో బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచిన పింక్ సినిమా రీమేక్ అయిన వకీల్ సాబ్, అయ్యపనం కోషియం అనే మళయాల సినిమాను తెలుగులో భీమ్లానాయక్ గా తెరకెక్కించారు. కాగా ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లనే రాబట్టాయి. కానీ పవన్ పొరుగు రాష్ట్రాల సినిమాలను రీమేక్ కాకుండా తనదైన స్టైల్లో పవన్ కు తగిన స్ట్రైట్ సినిమా ఎప్పుడు తీస్తాడా అని ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

బిగ్ ఎక్సైట్‌మెంట్ రాబోతుందన్న హరీశ్

ఈ నేపథ్యంలోనే సరిగ్గా హరీష్ శంకర్‌తో ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమా ప్రకటన రావడంతో పవన్ అభిమానులంతా ఎంతగానో సంతోషించారు. అయితే ఈ ప్రకటన వచ్చి ఏడాది అయినప్పటికీ ఈ సినిమా గురించి ఎటువంటి అప్డేట్ లేకపోడవం మరియు పవన్ కళ్యాణ్ హరీశ్ ను కాదని సాహో డైరెక్టర్ సుజిత్ తో కలిసి సినిమా చెయ్యబోతున్నాడంటూ వచ్చిన ప్రకటన నేపథ్యంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమా లేనట్టే అనే వార్తలు వినిపించాయి. కాగా తాజాగా ఈ సినిమా గురించి హరీశ్ శంకర్ స్పందిస్తూ ఒక బిగ్ ఎక్సైట్‌మెంట్ రాబోతుంది, వెయిట్ చేయండి” అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ‘భవదీయుడు’ గురించి అప్డేట్ ఇవ్వబోతున్నారు అంటూ పవన్ అభిమానులు సందడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు ఈ సినిమా స్క్రిప్ట్ పనులు ముగిశాయని ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయంటూ టాక్ విసినిపించింది.

మాకొద్దు రీమేక్స్ అంటున్న అభిమానులు

కాగా ఈ సినిమా అంతా తమిళ సినిమా విజయ్ దళపతి నటించిన తేరీకు రీమేక్ గా ఉండనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి తేరీ సినిమా తెలుగులో ఇదివరకే పోలీసోడు గా రీమేక్ అయ్యింది. ఈ చిత్రంలో విజయ్ సరసన సమంత జోడీగా నటించింది. దానితో సోషల్ మీడియా అంతటా పెద్ద చర్చ కొనసాగుతోంది. మాకు రీమేక్ సినిమాలు వద్దు స్ట్రెయిట్ సినిమాలే కావాలంటూ పవన్ అభిమానులు #WeDontWantTheriRemake అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఇంకా ఎన్నిరోజులు భయ్యా చూసిన స్టోరీతో కాకుండా కొత్త స్టోరీతో రండి మేము ఇంకో సంవత్సరం అయినా వెయిట్ చేస్తాం అంటూ చిత్రవిచిత్ర మీమ్స్ మరియు గిఫ్ లతో నెట్టింట ఓ పవన్ అభిమాని కామెంట్ చేశాడు. ఇలా ఈ సినిమా గురించి పెద్ద రచ్చే నడుస్తోందని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే మరికొందరు నెటిజన్లు అయితే ఇది ఫ్రెష్ కంటెంట్ అని రీమేక్ కాదని హరీష్ శంకర్ ని నమ్మండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.


భవదీయుడు భగత్ సింగ్ పట్టాలెక్కేనా..

హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ చేసిన గబ్బర్ సింగ్ సినిమా ఊహలకు అందని విజయాన్ని తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. మరి వారి కాంబినేషన్ లోనే ‘భవదీయుడు భగత్‌సింగ్’వస్తుందనే సరికి అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ప్రస్తుతానికి ఈ మూవీని పక్కన పెట్టేశారని, ఈ అనౌన్స్‌మెంట్ తమిళ సినిమా ‘తేరీ’ రీమేక్ అంటూ టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియాలంటే దర్శకుడు హరీశ్ శంకర్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే. అయితే ప్రస్తుతం పవన్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version