SS Rajamouli: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమా “ఆర్ఆర్ఆర్”. దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాని.. భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మించారు. ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్… తారక్ కి జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరీస్ నటించారు. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. కేవలం భారత్ లోనే కాకుండా యూఎస్, జపాన్ లోనూ ఈ సినిమాకి బ్రహ్మరధం పడుతున్నారు. అలానే ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను కైవసం చేసుకుంటుంది. ఇటీవల న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ నుంచి బెస్ట్ డైరెక్టర్‌గా ఆర్ఆర్ఆర్ మూవీకి రాజమౌళి అవార్డు అందుకున్నారు. తాజాగా ఈ సినిమా మరోసారి చరిత్రను తిరగరాసింది.
సీక్వెల్ గురించి ప్రస్తావించిన రాజమౌళి
గోల్డెన్ గ్లోబ్ అవార్డు బరిలో నిలిచిన ఈ సినిమా బెస్ట్ సాంగ్ కేటగిరీలో అవార్డును కైవసం చేసుకుంది. ఇది తెలుగు ప్రేక్షకులు గర్వించదగ్గ విషయం అని అంతా మూవీ టీంని అభినందిస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకి అవార్డు రావడం పట్ల పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేయగా.. జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో అదరగొట్టారు. మరోవైపు ఈ అవార్డు వేడుకల్లో భాగంగా చిత్ర బృందం హాలీవుడ్ మీడియాతో ముచ్చటించారు. ఈ మేరకు రాజమౌళి సంచలన ప్రకటన చేశారు. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి ప్రస్తావించారు.
ఈ సంధర్భంగా ఓ రిపోర్టర్… ఎంతో ఫినామినా క్రియేట్ చేసిన ఈ చిత్రానికి సీక్వెల్ ఎప్పుడు ఉంటుందని ప్రశ్నించారు. ఇందుకు బదులుగా డైరెక్టర్ రాజమౌళి(SS Rajamouli) సమాధానం చెబుతూ.. సినిమా విడుదలై ఇంత గొప్ప ఆదరణ పొందినప్పుడు, మాకు సీక్వెల్ చేయాలనే ఆలోచన వచ్చింది. మాకు కొన్ని మంచి ఐడియాలు వచ్చాయి. అయితే బలవంతంగా సీక్వెల్ తీయకూడదని అనుకున్నాం. కానీ కొద్ది రోజుల క్రితమే ఓ అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఆధారంగా మా నాన్నగారు, నా టీం స్క్రిప్ట్ రైటర్ లతో చర్చించాను. వెంటనే కథ రాయడం ప్రారంభించాం. అయితే, స్క్రిప్ట్ పూర్తయ్యేదాకా సీక్వెల్ విషయంలో మేం ముందుకెళ్లలేం. త్వరలోనే సీక్వెల్ గురించి ముందుకు వెళ్తాం అని రాజమౌళి వెల్లడించారు. ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.
ఇవి కూడా చదవండి
Ram Charan: రామ్‌చరణ్ మెగా రివీల్: నెక్ట్స్ మార్వెల్ హీరో.. ఐరన్ మ్యాన్ vs కెప్టెన్ అమెరికా.. నేను నటించే సూపర్ హీరో క్యారెక్టర్ ఏంటంటే..
Ram Charan: రామ్‌చరణ్ గోల్డెన్ గ్లోబ్ ఇంటర్వ్యూ: ఏం యాక్సెంట్‌రా బాబూ.. మెగా పవర్‌స్టార్ అదరగొట్టేశాడు..
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/