Site icon Prime9

Janasena Yuvashakthi: నా ప్రాణం పోతుంది.. అయినా పిరికివాణ్ణి కాదు- పవన్ కళ్యాణ్

pawan kalyan on 2024 his political career in janasena yuva shakthi

pawan kalyan on 2024 his political career in janasena yuva shakthi

Janasena Yuvashakthi: ఒక దేశపు సంపద నదులు కాదు ఖనిజాలు కాదు.. కలల ఖనిజాలతో చేసిన యువత అని ప్రసంగాన్ని ప్రారంభించారు పవన్. రణస్థణంలో జరుగుతున్న సభలో పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ఈ సభలో పవన్ మట్లాడుతూ తను సినిమాలు చేస్తున్నప్పటికి తన మనసు కష్టాల్లో ఉన్న ప్రజల గురించే ఆలోచిస్తోందని అన్నారు. సత్యాన్ని సాహాసాన్నే నమ్ముకున్నా అని.. మహా అయితే ఏం అవుతుంది నా ప్రాణం పోతుంది అని కళ్యాణ్ అన్నారు. ఎన్నికల్లో గెలుస్తానో లేదో తెలియదు గాని పోరాటం మాత్రం చేస్తానని అన్నారు. గూండాగాళ్లను, వెధవలను ఎలా ఎదుర్కొవాలో తనకు తెలుసున్నారు.

చివరివరకు రాజకీయాల్లోనే

తనకు సుఖాల మీద మమకారం లేదని.. మనిషి తాలుకూ అంతిమ లక్ష్యం ఏంటో తెలుసా అని పవన్ ప్రశ్నించారు. చేతిలో డబ్బు లేకున్నా.. ప్రజల కోసం పార్టీ పెట్టానని అన్నారు. అప్పుడు తన చేతిలో రూ. 13 లక్షలు మాత్రమే ఉన్నా కూడా వెనకడుగు వేయలేదని పవన్ చెప్పారు. అలాంటి యువత అవనీతిని ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు. ఉత్తరాంధ్ర పిరికిగడ్డ కాదని.. అది ఎన్నో ఉద్యమాలకు ఊపిరులూదిన ప్రాంతామని అన్నారు.

చివరి శ్వాస వరకు రాజకీయాల్లో ఉండి.. పేదలకు అండగా పోరాడుతానని పవన్ అన్నారు.

ఓ వైపు సినిమాలు చేస్తూనే.. రాజకీయాల్లో కొనసాగుతానని పేర్కొన్నారు. సుఖాల మీదు మమకారం ఉంటే రాజకీయాలను ఎప్పుడో వదిలేసేవాడినని అన్నారు.

నేను సాధించిన దానికి సంతోషం లేదని.. ప్రతి రోజు సన్నాసుల చేత మాట అనిపించుకోకుండా ఉండగలనని అన్నారు. కానీ ప్రజల కోసమే ప్రతి ఎదవ చేత మాటలు పడతున్నానని పవన అన్నారు.

మూడు ముక్కల ముఖ్యమంత్రి

వైసీపీ అసమర్థ పాలనతో రెండుగా చీలిన రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేసే ప్రయత్నం చేస్తున్నారని పవన్ మండిపడ్డారు. మూడు ముక్కల ముఖ్యమంత్రి.. మూడు ముక్కుల ప్రభుత్వం అంటు సెటైర్లు వేశారు. వైసీపీ నాయకులను ఎదుర్కొవడం తనకు పెద్ద విషయం కాదని.. వైస్ రాజశేఖర్ రెడ్డి లాంటి నాయకుడినే ఎదుర్కొన్నానని పవన్ తెలిపారు. తనపై దాడులు చేసిన.. కేసులు పెట్టిన భయపడేదిలేదని
తెలిపారు.

ఇవి కూడా చదవండి..

Varahi: వారాహిని అడ్డుకునేందుకే జీవో నెంబర్ 1

Janasena Yuvashakthi: తమనీడను తామే చూసి భయపడే స్వభావం జగన్ ది- నాగబాబు

Janasena Yuvashakthi: జ్ఞాని ఎవరంటే.. భగవద్గీత శ్లోకం చదివి అందరి చేతా వావ్ అనిపించిన ముస్లిం యువతి

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter:  https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version