Site icon Prime9

Janasena Yuvashakthi: ఫస్ట్ టైం.. ఉత్తరాంధ్ర కళాకారులతో కలసి స్టేజిపై డ్యాన్స్ చేసిన పవన్ కళ్యాణ్

pawan dance on janasena yuvasena

pawan dance on janasena yuvasena

Janasena Yuvashakthi: శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో జనసేన యువశక్తి సభ నిర్వహిస్తుంది. ఇప్పటికే ఈ సభకు భారీస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో యువత కూడా చేరుకున్నారు. జిల్లాలోని లావేరు మండలం తాళ్లవలస పంచాయితీ పరిధిలో 35 ఎకరాల ప్రైవేటు స్ధలంలో పవన్ సభ నిర్వహిస్తున్నారు. వివేకానంద జయంతిని పురస్కరించుకొని సభావేదికకు వివేకానంద వికాస వేదికగా నామకరణం చేశారు.

’’25 కేజీల బియ్యం ఇవ్వడానికి నేను రాలేదు.. మీకు 25 ఏళ్ల భవిష్యత్ ఇవ్వడానికి జనసేన ఉంది‘ అనే నినాదంతో ఈ సభ నిర్వహిస్తున్నారు. వివేకానంద జయంతిని పురస్కరించుకొని సభావేదికకు వివేకానంద వికాస వేదికగా నామకరణం చేసారు. సభా ప్రాంగణానికి వచ్చే నాలుగు గేట్లకు ఉత్తరాంద్ర యోధులైన గిడుగు రామ్మూర్తి పంతులు , వీరనారి గున్నమ్మ , కోడిరామ్మూర్తి నాయుడు, అల్లూరి సీతారామరాజు పేర్లు పెట్టారు.

ఫస్ట్ టైం స్టేజ్..

కాగా ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు. పలువు యువత సభలో ప్రసంగించారు. కాగా తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభలోకి ఎంట్రీ ఇచ్చారు. సభపై పవన్‌తో పాటు 100 మంది యువ ప్రతినిధులు వేదికపై కూర్చునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పవన్ కళ్యాణ్ పక్కన నాదెండ్ల మనోహర్, నాగబాబు కూర్చున్నారు. ఈ మేరకు ఫస్ట్ టైం.. ఉత్తరాంధ్ర కళాకారులతో కలసి స్టేజిపై పవన్ డ్యాన్స్ చేశారు.

ఉత్తరంధకు చెందిన కళాకారులు నృత్య ప్రదర్శన చేస్తుండగా వారి డాన్స్ ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్న పవన్ ని తమతో పాటు డాన్స్ చేయాలని వారు కోరడంతో.. పవన్ కూడా వారితో కలిసి నృత్యం చేశారు. ఈ సభలో ఏపీలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై సభలో రాజకీయ తీర్మానాలు చేయనున్నారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అనుసరించాల్సిన కార్యాచరణపై యువశక్తి సభ ద్వారా పవన్ ప్రకటన చేస్తారని సమాచారం అందుతుంది.

 

 

ఇవి కూడా చదవండి..

Varahi: వారాహిని అడ్డుకునేందుకే జీవో నెంబర్ 1

Janasena Yuvashakthi: తమనీడను తామే చూసి భయపడే స్వభావం జగన్ ది- నాగబాబు

Janasena Yuvashakthi: జ్ఞాని ఎవరంటే.. భగవద్గీత శ్లోకం చదివి అందరి చేతా వావ్ అనిపించిన ముస్లిం యువతి

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version