Janasena Pawan kalyan : లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ కూడా మా పనేనా.. ఇంక పోలీసులు ఎందుకు ? : పవన్ కళ్యాణ్

టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ హైదరాబాద్ లో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఏపీ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.

  • Written By:
  • Updated On - January 8, 2023 / 03:49 PM IST

Janasena Pawan kalyan : టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ హైదరాబాద్ లో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఏపీ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ భేటీ అనంతరం చంద్రబాబు, పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ జీవో నెం 1 కేవలం ప్రతిపక్షాలకు మాత్రమే. ప్రతిపక్షాలు బయటకు రాకూడదు. ప్రజలతో మాట్లాడకూడదు. ప్రజాసమస్యలు తెలుసుకోకూడదు ఇదే వాళ్ల లక్ష్యం. నేను విశాఖ జనవాణి కార్యక్రమాన్ని వెళ్తే అడ్డుకున్నారు.

ప్రజలు తమ సమస్యలు చెప్పుకోకుండా చేస్తున్నారు. కందుకూరు ఘటనే తీసుకోండి. రాజకీయ పార్టీలు సభల గురించి పోలీసులకు ముందుగానే సమాచారం ఇస్తాయి. ఇంతమంది వస్తారని పోలీసుల భద్రత కావాలని ముందుగానే కోరతాం. లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ కూడా మా పనేనా. లాఠీ కూడా పట్టుకోవాలా? ఇంక పోలీసులు ఎందుకు?. గుంటూరు ఘటన కేవలం సెక్యూరిటీ సమస్య వల్ల జరిగింది. అంతే కాదు కోనసీమ అల్లర్లు, రిజర్వేషన్ల గొడవలు, కోడికత్తి ఘటన, వివేకానంద హత్య చూశాం వైసీపీ నేతలే దాడులు చేయించుకున్న సంస్కృతి.

అక్కడ గొడవలు జరుగుతాయని పోలీసులకు ముందే తెలుసు : పవన్ కళ్యాణ్ ..

మంత్రులే వాళ్ల ఇళ్లు తగలబెట్టుకున్నారు. ఈ ఘటనల్లో పోలీసులు తమ పనిచేయకుండా ఉంటే చాలు సంఘ విద్రోహ శక్తులు దారుణాలకు పాల్పడుతుంటాయి. వైజాగ్ ఘటనలో కూడా ముందుగా గొడవలు జరుగుతాయని పోలీసులకు సమాచారం ఉంది. కానీ పోలీసులు ఏంపట్టించుకోలేదు అని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వైసీపీ నేతలు వీరి భేటీ పట్ల ట్విట్టర్ వేదికగా విమరాలు చేస్తున్నారు.

ఇవి కూడా  చదవండి..

Suryakumar Yadav : సూర్యకుమార్ యాదవ్ ఊరకొట్టుడు.. మూడో టీ20లో శ్రీలంకపై భారత్ సూపర్ విక్టరీ

China Accident : చైనాలో ఘోర ప్రమాదం..17 మంది మృతి, 22 మందికి గాయాలు.. కారణం ఏంటంటే?

Prince Harry : విలియం నాపై దాడిచేసాడు… ఆత్మకధలో సంచలన విషయాలు వెల్లడించిన ప్రిన్స్ హ్యారీ

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/