Site icon Prime9

80s Stars Reunion: అలనాటి తారలు ఒక్కటైన వేళ.. ఫొటోలు వైరల్

Evergreen 80s Stars Reunion for 11th Anniversary in mumbai

Evergreen 80s Stars Reunion for 11th Anniversary in mumbai

80s Stars Reunion: చెందిన 80ల్లో వెండితెరపై మెరిసి సందడి చేసిన దక్షిణాది, ఉత్తరాది నటీ నటులందరూ ఒకేచోట కలిసి సందడి చేశారు. మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సరదాగా ఆడిపాడుతూ ఎంజాయ్ చేశారు. కరోనా మహమ్మారి తర్వాత ఈ బృందం తమ వార్షిక ఆహ్లాదకరమైన సంప్రదాయాన్ని కొనసాగించడానికి శనివారం సాయంత్రం ముంబైలో తిరిగి కలుసుకున్నారు.


అలనాటి తారలంతా కలిసి ప్రతి ఏటా ఈ రీయూనియన్‌ వేడుకలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఒక్కో ఏడాది ఒక్కో స్టార్‌ ఈ వేడుకలకు ఆతిథ్యం ఇవ్వడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. కాగా ఇందులో భాగంగా తాజాగా జరిగిన 11వ రీయూనియన్‌ వేడుకకు నటుడు జాకీ ష్రాఫ్‌, నటి పూనమ్‌ ధిల్లాన్‌ ఆతిథ్యమిచ్చారు. ఈ వేడుక కోసం దక్షిణాది నుండి దాదాపు 25 మంది సినీ ప్రముఖులు ముంబైకి చేరారు. వారిలో చిరంజీవి, వెంకటేశ్‌, నదియా, రమ్యకృష్ణ, విద్యాబాలన్‌, సుహాసిని, జయప్రద, రాధ, శోభన, భానుచందర్‌, అనుపమ్‌ ఖేర్‌, శరత్‌కుమార్‌, నరేశ్‌, అనిల్‌ కపూర్‌, అర్జున్‌, రాజ్ బబ్బర్, మీనాక్షి శేషాద్రి, టీనా అంబానీ మరియు మధుతో సహా హిందీ సినీ రంగానికి చెందిన నటీనటులు కూడా ఇందులో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

మహారాష్ట్ర శైలిలో అలంకరించబడిన మరియు స్థానిక రుచులతో కూడిన వంటకాలు ఈ రీయూనియన్‌లో ఏర్పాటు చేశారు. బాలీవుడ్, దక్షిణాదికి చెందిన అనేక మంది నటీనటులు కలిసి కొన్ని సరదా గేమ్‌లు మరియు క్విజ్‌లలో పాల్గొంటూ సరదాగా ఆటపాటలతో సమాయాన్ని గడిపారు. సంప్రదాయానికి అనుగుణంగా, ఈ సంవత్సరం రంగు థీమ్‌ మహిళలు వెండి మరియు నారింజ రంగు దుస్తులను కలిగి ఉండగా, పురుషులు బూడిద మరియు నారింజ రంగులను కలిగి ఉన్నారు. కాగా 2020లో జరిగిన 10వ రీయూనియన్‌ వేడుకలకు మెగాస్టార్‌ నివాసం వేదికైన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: ‘పుష్ఫ 2’ ప్రోమో డిసెంబర్ 16న విడుదల?

Exit mobile version