Site icon Prime9

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మద్దతు కోరిన లండన్ మేయర్ అభ్యర్థి తరుణ్ గులాటీ..

london mayor contestant tarun gulati requested pawan kalyan support for election

london mayor contestant tarun gulati requested pawan kalyan support for election

Pawan Kalyan : లండన్ మేయర్ ఎన్నికలలో పోటీ చేస్తున్న భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త తరుణ్ గులాబీ బుధవారం హైదరాబాద్ లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఈ సందర్భంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న గులాటీ మేయర్ ఎన్నికల్లో తనకు మద్దతు పలకాల్సిందిగా పవన్ ని కోరారు. తాను పోటీ చేస్తున్న ప్రాంతంలో పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులు గణనీయంగా ఉన్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

అందుకు గాను గులాటి అభ్యర్ధనను పవన్ స్వాగతించారు. భారత సంతతికి చెందిన గులాటి లండన్ మేయర్ ఎన్నికల్లో పోటీ చేయడం సంతోషదాయకమని, తన అభిమానులు, జనసేన శ్రేణులతోపాటు తెలుగువారు, భారతీయులంతా ఆయన విజయానికి కృషి చేయాలని పవన్ కళ్యాణ్ కోరారు.

 

 

ఇక మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నారు. జనసేనకు బీజేపీ ఎనిమిది స్థానాలు కేటాయించింది. అందులో గ్రేటర్ పరిధిలో ఒక్క కూకట్ పల్లి మాత్రమే ఉంది. మిగతా అన్నీ వివిధ జిల్లాల్లో ఉన్నాయి.

కూకట్‌పల్లి-ప్రేమ్‌కుమార్‌

తాండూరు-శంకర్‌గౌడ్‌

కోదాడ-మేకల సతీష్‌రెడ్డి

ఖమ్మం-మిర్యాల రామకృష్ణ

నాగర్‌కర్నూలు-వంగ లక్ష్మణ్‌గౌడ్‌,

వైరా-సంపత్‌నాయక్

కొత్తగూడెం-లక్కినేని సురేందర్‌రావు

అశ్వారావుపేట-ముయబోయిన ఉమాదేవి

కాగా ఎల్బీ స్టేడియంలో జరిగిన బీసీ ఆత్మగౌరవ సభకు ప్రధాని మోదీతో పాటు పవన్  కూడా హాజరయ్యారు. పవన్‌ కల్యాణ్ లాంటి స్టార్‌ హీరో ప్రచారానికి వస్తే కచ్చితంగా తమకు మేలు జరుగుతుందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. అందుకే ప్రచారానికి పవన్‌ను ఉపయోగించుకోవాలని తెలంగాణ బీజేపీ అభ్యర్థులు అనుకుంటున్నారు. మరి పవన్‌ ప్రచారంలో పాల్గొంటారో లేదో చూడాలి.

 

Exit mobile version