CPI Narayana: గవర్నర్ తమిళిసై లక్ష్మణరేఖ దాటారని సీపీఐ నారాయణ అన్నారు. బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ విధానాలను గవర్నర్ ఎందుకు వ్యతిరేకించడం లేదు అని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ పదవే పనికిమాలినదని విమర్శించారు. బీజేపీ నాయకులను గవర్నర్‌ను చేస్తే ఇలానే ఉంటుందన్నారు.
రాజకీయాలు చేసే ఏ గవర్నరైనా పనికిమాలిన గవర్నరేనని, తమిళిసైని వెంటనే రీకాల్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇకపోతే, అసభ్యంగా వున్నందునే బిగ్‌బాస్‌ను విమర్శించానని ఆయన తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. బిగ్‌బాస్‌లో మహిళలను కించపరిచేలా ప్రసారం చేస్తున్నారని, చిరంజీవికి, నాగార్జునకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా వుందని సీపీఐ నారాయణ వ్యాఖ్యానించారు. నాగార్జున డబ్బు కోసం కక్కుర్తి పడతారని ఆయన ఆరోపించారు.