Site icon Prime9

Chiranjeevi: పవన్ కల్యాణ్ అనుకుంటే చేస్తాడు.. రాజీయాలపై చిరు సంచలన కామెంట్స్

chiranjeevi-says-pawan-kalyan definetly become a strong political leader

chiranjeevi-says-pawan-kalyan definetly become a strong political leader

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నేడు హైదరాబాదులోని వైఎన్ఎం కాలేజి పూర్వవిద్యార్థుల సమ్మేళనానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. తాను చదివిన కళాశాల నాకు పాఠాలతో పాటు విలువలు నేర్పిందని ఈ రోజు నా మిత్రులను కలవడం చాలా ఆనందంగా ఉందంటూ అలనాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఒకానొక సమయంలో కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటివరకు అనుకువన్నీ చేశానని తనకు కష్టాన్ని ఎదుర్కొనే గుణాన్ని, పనితనాన్ని నేర్పింది ఎన్ సీసీ అని ఆయన చెప్పుకొచ్చారు. తనకు చిన్ననాటి నుంచే నటనంటే ఇష్టమని కాగా కాలేజీలో వేసిన నాటకంతో సినిమాల్లోకి వచ్చానని వెల్లడించారు. అప్పటి నుంచి, తాను అనుకున్నదాని అంతు చూడడం నేర్చుకున్నానని వివరించారు.

ఇదిలా ఉంటే మరోవైపు పవన్ రాజకీయాలపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ కూడా అనుకున్నది చేసే రకమని ఆయన వెల్లడించారు. రాజకీయాలకు పవన్ తగినవాడు అని పేర్కొన్నారు. ఏదో ఒకనాడు పవన్ కల్యాణ్ ను ఉన్నతస్థాయిలో చూస్తామని చిరంజీవి ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో మాటలు పడాల్సి ఉంటుందని, ఒక్కోసారి మనం కూడా మాటలు అనాల్సి ఉంటుందని చిరంజీవి వెల్లడించారు. మొరటుగా, కటువుగా లేకపోతే రాజకీయాల్లో రాణించలేరని, ఓ దశలో నాకు రాజకీయాలు అవసరమా? అనిపించిందని ఆయన అన్నారు.

ఇదీ చదవండి

Exit mobile version