Site icon Prime9

Vishuvardhan: తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై సంచలన ఆరోపణలు

Sensational allegations against Telugu states

Sensational allegations against Telugu states

BJP leader Vishuvardhan: పీఎఫ్ఐ టెర్రరిస్టుల వెనుక ఏపి, తెలంగాణ ప్రభుత్వాలున్నాయని ఆయన ఆరోపించారు. ఉగ్రవాదులపై ఎన్ఐఏ చర్యను స్వాగతిస్తున్నామని అన్నారు. పీఎఫ్ఐ అనేక ఉగ్రవాద కార్యకలాపాలు, అల్లర్లకు పాల్పడిందని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తల పైనా దాడులకు పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. వైకాపా, టీఆర్ఎస్ ప్రభుత్వాలు పీఎఫ్ఐ చర్యలను అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదన్నారు.  అయితే వారిని ప్రసన్నం చేసుకోవడానికి ఉగ్రవాదు సంస్ధకు వెనుక నుండి మద్దతిచ్చాయని విమర్శించారు.

ఈ పద్దతి అత్యంత విచారకరమని పేర్కొన్నారు. పీఎఫ్ఐ కార్యకలాపాలపై అడ్డుకొని, చర్యలు తీసుకున్న కేంద్ర హోం శాఖకు ఆయన ధన్యవాదాలను తెలిపారు.

తెలంగాణాలో నిజామాబాద్, జగిత్యాల, భైంసా జిల్లాలతో పాటు ఏపీలో నెల్లూరు జిల్లాలో ఏక కాలంలో దాడులు జరగ్గా, నిజామాబాధ్ జిల్లాలో పలుచోట్ల భారీ యెత్తున సోదాలు జరిగాయి. భాజపా నేత ఆరోపణలను రెండు తెలుగు ప్రభుత్వాలు ఏమేరకు స్పందిస్తాయో వేచిచూడాలి.

Exit mobile version