Site icon Prime9

Smriti Irani: సమాచార లోపంతో బుక్కయిన మంత్రి స్మృతి ఇరాని

Minister Smriti Irani booked with wrong information

Minister Smriti Irani booked with wrong information

Prime9News Desk:  వివరాల్లోకి వెళ్లితే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి భారత్ జోడో యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. బిజెపి పలు అంశాలను సంధిస్తూ కాంగ్రెస్ జోడో యాత్రను అడ్డుకొనేందుకు పలు విధాలుగా ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ జోడో యాత్ర ప్రారంభంలో స్వామి వివేకానందను మర్చిపోవడం సిగ్గుగా అనిపించడం లేదా అంటూ రాహుల్ పై విమర్శలు గుప్పించింది.

దీనికి కాంగ్రెస్ ఘాటుగానే సమాధానం ఇచ్చింది. కన్యాకుమారి నుండి యాత్ర బయలుదేరే ముందు రాహుల్ గాంధీ వివేకనందుడి విగ్రహాన్ని సందర్శించి ఆయనకు నివాళులు  అర్పించారు. రాహుల్ నమస్కారం చేస్తున్న  వీడియోను స్మృతి ఇరానీకి పంపిన కాంగ్రెస్ నేతలు స్పష్టంగా కనపడాలంటే కొత్త కళ్లద్దాలు పంపిస్తాం అంటూ వ్యంగాస్త్రాలు విసిరారు. దీంతో ఏదో చేద్దామని భావించిన బిజెపి నేతలపై నీళ్లు చల్లిన్నట్లైయింది.

విమర్శలు చేసే సమయంలో వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడడం ఎంతవరకు సబబని బీజేపి శ్రేణుల్లో చర్చించు కోవడం కొసమెరుపుగా భావించాల్సిందే.

Exit mobile version