Telangana: తెలుగురాష్ట్రాల ప్రజలకు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి పెద్ద పండుగ. అందులోనూ గోదావరి జిల్లా వాసులకైతే ఈ పండుగ ఎంతో ప్రత్యేకమని చెప్పాలి.
ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా సంక్రాంతి నాడు స్వగ్రామాలకు చేరుతారు. ఇంక హైదరాబాద్ నగర వాసులు అంతా సంక్రాంతికి పల్లెబాట పట్టారు.
ఇరు తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి సంక్రాంతి సెలవులు కావడంతో సొంత ఊళ్లకు పయనమయ్యారు.
దానితో తెలంగాణ (Telangana) హైదారాబాద్ సిటీలో ట్రాఫిక్ రద్దీ తగ్గింది. భాగ్యనగరంలో స్థిరపడిన ఆంధ్రావాసులు, ఉద్యోగులు, విద్యార్థులు సంక్రాంతికి స్వస్ధలాలకు వెళుతుండటంతో రైళ్లు, బస్సులు, కిక్కిరిశాయి.
జనజీవనం బోసిపోయి పలు వీధుల్లోని ఇళ్లన్నీ తాళాలువేసి కనిపిస్తున్నాయి.
తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా..
ఈ నేపథ్యంలో తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా పలువురు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.
ఇక్కడి దొంగలే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠాలు భాగ్యనగరానికి చేరుకొని దోపిడీలకు పాల్పడుతున్నారని పోలీసులు చెప్తున్నారు.
ఇళ్లకు వీధుల చివర్లోనూ సీసీ కెమెరాలు అమర్చాలని అధికారులకు సూచిస్తున్నారు.
నగరంలో మరింత పటిష్ట బందోబస్తును రాత్రి వేళల్లో పోలీస్ పెట్రోలింగ్ ను పెంచామని చెపుతున్నారు.
ఇంట్లో డబ్బు నగలు లేవు అనవసరంగా రాకండి అంటూ నోటీసులు
కాగా ఈ తరుణంలో ఓ ఇంటి యజమాని తమ ఇంటి డోర్స్ మీద ఓ ఆసక్తికర నోటీసు పెట్టారు.
మేము సంక్రాంతికి ఊరికి వెళ్తున్నాము.. మా ఇంట్లో ఉన్న డబ్బు నగలు మాతోనే తీసుకుని వెళ్తున్నాము.. మా ఇంటికి రాకండి.. అనవసరంగా తాళం, తలుపులు పగలగొట్టకండి అంటూ అందులో పేర్కొన్నాడు.
ప్రస్తుతం ఈ నోటీసు కాస్త నెట్టింట వైరల్ గా మారింది. దొంగకు ఇంత క్లియర్ గా ఇన్ ఫర్మేషన్ ఇస్తే ఇంకెందుకు దొంగతనం చేస్తాడు అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/