Site icon Prime9

Amit Shah : బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఒప్పందం జరిగింది.. బీజేపీకి ఓటు వేస్తేనే ప్రజా పాలన – అమిత్ షా

bjp central minister Amit Shah speech at huzurabad meeting

bjp central minister Amit Shah speech at huzurabad meeting

Amit Shah : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతుంది. ఈ క్రమంలోనే ప్రచార పర్వం ముగింపు దశకు చేరుకుంది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ప్రచారానికి గడువు ఉండడంతో అధికార, ప్రాతిపక్ష పార్టీలన్నీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. అందులో భాగంగానే బీజేపీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా హుజురాబాద్ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆ తర్వాత పెద్దపల్లిలో జరిగిన రోడ్ షోకి కూడా హాజరయ్యారు. హుజూరాబాద్ నియోజక వర్గం నుండి ఈటల రాజేందర్ ను గెలిపించండి.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అని ఆయన పేర్కొన్నారు. పేదల తరుపున మాట్లాడినందుకే.. కేసీఆర్ ఈటలపై కక్ష్య పెంచుకొని పార్టీ నుండి బయటకి పంపారు అంటూ అమిత్ షా సంచలన ఆరోపణలు చేశారు.

Exit mobile version