Site icon Prime9

Chiranjeevi: నేను ఏ ఒక్కరినీ ఉద్దేశించి చెప్పట్లేదు.. చిరంజీవి క్లాస్ పీకింది ఎవరికి?

chiranjeevi

chiranjeevi

Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవి నటించిన చిత్రం “వాల్తేరు వీరయ్య”. సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరిస్తోంది.

బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ ముఖ్యపాత్రలో నటించాడు. ఈ చిత్రంలో మెగాస్టార్‌కు జోడీగా శృతిహాసన్ నటించింది.

మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. తాజాగా ఈ చిత్ర సక్సెస్ మీట్‌ను చిత్రబృందం హైదరాబాద్‌లో నిర్వహించింది.

ఈ కార్యక్రమానికి మూవీ యూనిట్ హాజరయ్యారు. ఈ సంధర్భంగా చిరంజీవి మాట్లాడుతూ నేటి తరం దర్శకులకు తనదైన శైలిలో చురకలు అంటించారు.

అసలు చిరంజీవి(Chiranjeevi) ఏమన్నారంటే..?

డైరెక్టర్స్ ఈగోలకి వెళ్ళకూడదు. డైరెక్టర్ సినిమా హిట్ ఇవ్వడం కాదు. ఇచ్చిన టైములో, ఇచ్చిన బడ్జెట్ లో సినిమాని తీయగలగాలి.

ఎవరో డైరెక్టర్ భారీగా తీశారు కదా అని మనం అక్కర్లేకపోయినా భారీగా వెళ్ళకూడదు. సినిమాని షూట్ చేసి ఇది అక్కర్లేదు అని ఎడిటింగ్ లో కట్ చేయకూడదు.

అలా చేయడం వాళ్ళ డబ్బు, టైం, కష్టం అంతా వేస్ట్ అవుతుంది. అదంతా నిర్మాతలకి నష్టమే. ఏ మార్పులు, చూపులు ఉన్నా పేపర్ వర్క్ మీదే చేసుకోవాలి.

అంతా ఓకే అనుకున్నాకే షూట్ కి వెళ్ళండి. ఇప్పటి డైరెక్టర్స్ చాలా నేర్చుకోవాలని అన్నారు.

నిర్మాతలు ఉన్నారు కదా అని డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టొద్దు. నిర్మాతలు బాగుంటేనే మనం బాగుంటం, సినీ పరిశ్రమ బాగుంటుంది.

ఇది దర్శకులు గుర్తించాలి అని తెలిపారు. అలాగే ఈ వ్యాఖ్యలని ఏ డైరెక్టర్ ని ఉద్దేశించి చేయలేదు, దయచేసి మీడియా వాళ్ళు తప్పుగా రాయకండి అని చిరంజీవి కోరారు.

ఈ సినిమా కథ అందరూ బాగుంది అని చెప్పినా బాబీని నేను పిలిచి పర్సనల్ గా మరింత వర్క్ చేయమని చెప్పాను.

అందరూ బాగుంది అన్నారు కదా అని చెప్పకుండా దాని మీద వర్క్ చేశాడు. సినిమా షూట్ టైములో కూడా ఎన్నో చేంజెస్ అప్పటికప్పుడు చేశారు.

సినిమా రిలీజ్ అయ్యేదాకా అందరూ చెప్పే డౌట్స్ ని బాబీ తన టీంతో కూర్చొని డిస్కస్ చేస్తూ సాల్వ్ చేసుకుంటూ వచ్చాడు కాబట్టే ఇంత మంచి సినిమా వచ్చింది.

ఎక్కడా ఇగోకి వెళ్లకుండా ఎవరు చెప్పినా వింటూ, దాని మీద మరింత కష్టపడి మంచి సినిమాని తీశాడు.

నా 41 ఏళ్ల అనుభవానికి డైరెక్టర్ గా బాబీ ఇచ్చిన గౌరవం అది అని చిరంజీవి తెలిపారు. ఈ సినిమాని నూతన దర్శకులు ఒక కేస్ స్టడీ లాగా తీసుకోవాలని సూచించారు.

సంబరాల రాంబాబు సంక్రాంతి స్టెప్స్ | Sambarala Rambabu Dance | @Prime9Digital

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

 

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version
Skip to toolbar