Site icon Prime9

Pawan Kalyan: ఆ విషయంలో జనసేనానికి అండగా కింగ్ నాగార్జున ..

king-nagarjuna-help-to-janasena-chief-pawan-kalyan

king-nagarjuna-help-to-janasena-chief-pawan-kalyan

Pawan Kalyan: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో చెప్పినట్లుగానే సినిమాలు రాజకీయాలు అంటూ జోడు గుర్రాల స్వారీ చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ పెరగడంతో పవన్ పూర్తిగా పొలిటికల్ కార్యక్రమాలకే సమయం కేటాయిస్తున్నారు. ఇటీవల నవంబర్ 19న వైజాగ్ హార్బర్ లో పెను అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం లో ఎంతో మంది మత్స్యకారులు తమ జీవనాధారాన్ని కొలపాయారు. ఈ ప్రమాదంలో మత్య్సకారులు బోట్లు దగ్దమయ్యాయి. దీనితో వందలాది కుటుంబాల పరిస్థితి దారుణంగా మారింది. బోట్లు కోల్పోయిన కుటుంబాలని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ ఒక్కొక్కరికి రూ 50 వేలు ఆర్థిక సాయం ప్రకటించారు.

ఇచ్చిన మాట ప్రకారం శుక్రవారం రోజు పవన్ కళ్యాణ్ వైజాగ్ చేరుకుని బాధితులకు చెక్కులు అందించారు. అయితే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి వైజాగ్ కి వెళ్లే సమయంలో గందరగోళం నెలకొంది. కొన్ని కారణాల వల్ల పవన్ కళ్యాణ్ ప్రయాణించాల్సిన ప్రత్యేక విమానం రద్దయింది. తాను ప్రయాణించాల్సిన విమానం రద్దు కావడం వెనుక వైసిపి ప్రభుత్వ హస్తం ఉందని పవన్ ఆరోపించారు. ఎలాగోలా మరో ఫ్లైట్ లో పవన్ వైజాగ్ చేరుకొని కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. అయితే పవన్ కళ్యాణ్ వైజాగ్ ఎలా చేరుకున్నారు అనే దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒక షాకింగ్ రూమర్ కూడా ప్రచారం లో ఉంది.

అక్కినేని నాగార్జున పవన్ కళ్యాణ్ వైజాగ్ చేరుకునేందుకు సాయం చేశారని, నాగార్జున తన ప్రత్యేక విమానాన్ని ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. నాగార్జునకి పవన్ తో అంతగా సాన్నిహిత్యం లేదు కానీ మెగా ఫ్యామిలీతో చిరంజీవితో చాలా క్లోజ్ గా ఉంటారు. వైజాగ్ కార్యక్రమానికి ఆలస్యం అవుతుందని పవన్ నాగార్జునని రిక్వస్ట్ చేసినట్లు.. వెంటనే నాగార్జున తన ప్రైవేట్ ఫ్లైట్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో క్లారిటీ లేదు. గతంలో నాగార్జున.. చిరంజీవి షాడో నుంచి బయటపడి సపరేట్ క్రేజ్ సొంతం చేసుకోవడం చాలా కష్టం అని అది పవన్ కళ్యాణ్ కి సాధ్యం అయిందని ప్రశంసించారు.

Exit mobile version