PM Modi In Vishakhapatnam: దేశంలోనే విశాఖ ప్రత్యేకమైన నగరం- మోదీ

ఆంధ్రప్రదేశ్‌లో 10,742 కోట్లతో దశలవారీగా చేపట్టనున్న అభివృద్ధి పనులకు, వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు ఇప్పటికే పూర్తి అయిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితం ఇచ్చారు ప్రధాని మోదీ. దేశంలోనే విశాఖ ప్రత్యేకమైన నగరమని ఆయన తెలిపారు.

PM Modi: ఆంధ్రప్రదేశ్‌లో 10,742 కోట్లతో దశలవారీగా చేపట్టనున్న అభివృద్ధి పనులకు, వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు ఇప్పటికే పూర్తి అయిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితం ఇచ్చారు ప్రధాని మోదీ. దేశంలోనే విశాఖ ప్రత్యేకమైన నగరమని ఆయన తెలిపారు. ఓఎన్జీసీ యూ ఫీల్డ్ ఆన్ షోర్ డీప్ వాటర్ బ్లాక్ ప్రాజెక్టును ప్రారంభించిన పీఎం జాతికి అంకితం చేశారు. 6 లేన్ గ్రీన్ ఫీల్డ్ రాయ్ పూర్- విశాఖ ఎకనామిక్ కారిడార్ కు శంకుస్థాపన చేశారు. అలాగే విశాఖ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు మోడీ శ్రీకారం చుట్టారురు. శ్రీకాకుళం అంగుల్ నేచురల్ గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు.

విశాఖ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, ఈస్ట్‌కోస్ట్‌ జోన్ పరిపాలన భవన సముదాయానికి మోదీ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వడ్లపూడిలో 260 కోట్లతో చేపట్టిన వ్యాగన్ వర్క్‌షాప్‌, హిందుస్థాన్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్ ప్లాంట్ ‎ఆధునికీకరణతో పాటు విస్తరణ పనులు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మేనేజ్ మెంట్ అండ్ కామర్స్ పరిపాలనా భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. చేపల రేవు ఆధునికీకరణ, కాన్వెంట్ కూడలి నుంచి షీలానగర్ పోర్టు రహదారికి శంకుస్థాపన మరియు శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో పాటు సీఎం జగన్ హాజరయ్యారు.

ఇదీ చదవండి: కేంద్రంతో తమ అనుబంధం పార్టీలు, రాజకీయాలకు అతీతం.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు