Site icon Prime9

Veera Simha Reddy: బాలకృష్ణ వీర సింహారెడ్డిపై వైసీపీ నేత తీవ్ర వ్యాఖ్యలు… సినిమా దొబ్బింది అంటూ

veera simha reddy movie flop said by YCP leader

veera simha reddy movie flop said by YCP leader

Veera Simha Reddy: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్, హనీ రోజ్ బాలయ్యకి జంటగా నటించారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన వస్తోంది. పక్కా మాస్ కమర్షియల్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందని.. అభిమానులకు అయితే పండగ లాంటి సినిమా అని అంటున్నారు. ఇక థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మూవీని మరో స్థాయికి తీసుకెళ్లింది.

సినిమా దొబ్బిందిగా..

‘వీరసింహారెడ్డి’ సినిమా విడుదల సందర్భంగా ఏపీలోని చాలా ఏరియాల్లో థియేటర్ల వద్ద పండగ వాతావరణం కనిపించింది. ఈరోజు తెల్లవారుజాము నుంచే ధియేటర్ల వద్ద బాలయ్య అభిమానులు హడావిడి చేశారు. కాగా సినిమా చూసిన అభిమానులు బాలయ్య జాతర మొదలైంది అంటున్నారు. కాగా ఈ సినిమాపై వైసీపీ నేత గుర్రంపాటి దేవేందర్ రెడ్డి ఈ సినిమాపై విమర్శలు కురిపిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లు చేస్తూ సినిమాపై నెగిటిక్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ ట్వీట్స్ లో.. సినిమా దొబ్బిందటగా బాలయ్య! అయినా సినిమాని సినిమాగా చూడకుండా మీ నారా నక్క బావ మాటలు విని, ఒక సంతకం, రెండు సంతకాలు అని ఎకసెక్కాలు పోతే ఇదుగో ఇలాగే నీ సంతకం, సినిమా రెండూ చిరిగిపోతాయి బాలయ్య! ఇక మీదటైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీసుకో సినిమాలు.. లేదంటే ఎప్పటికీ నీకు దబిడి దిబిడే!! అని రాసుకొచ్చారు.

జై బాలయ్య.. తాతకి పూనకం వచ్చింది | Old Man Dancing In Veera Simha Reddy Theater | Bala Krishna

అలానే టూమచ్ రారేయ్.. ఇది టూ.. మచ్!.. సినిమా చూడడానికి అమెరికా అధ్యక్షుడు పనులు మానుకుని పోయాడా.. అంతేనా లేక లిస్ట్ లో అమెరికా అధ్యక్షుడితో పాటూ రష్యా అధ్యక్షుడు పుతిన్, సౌత్ కొరియా అధ్యక్షుడు కిమ్, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి కూడా ఉన్నారా! మరీ ఇంత కులపిచ్చి ఏంట్రా బాబూ.. అని వరుస ట్వీట్స్ చేశారు.

మరోవైపు తిరుపతిలోని ప్రతాప్ థియేటర్ వద్ద బాలకృష్ణ అభిమానులు మేకపోతును బలిచ్చారు. అభిమానుల అరుపులు, కేకల మధ్య మేకపోతును బలిచ్చి బాలయ్యకు దిష్టి తీశారు. మూగ జీవాల్ని బలివ్వడాన్ని జంతు ప్రేమికులు వ్యతిరేకిస్తున్నారు. దేవతలకు అయినా సరే మేకపోతుల్ని, కోళ్లను బలివ్వడం కరెక్ట్ కాదని వాదిస్తున్నారు. ఆచారాల పేరుతో మూగజీవాల్ని చంపుతున్నారని విమర్శిస్తున్నారు.

 

ఇవీ చదవండి:

Cs Somesh Kumar: మీకు కర్మసిద్దాంతం అంటే ఏమిటో తెలుసా? మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పై తెలంగాణ టీచర్ సెటైర్లు

Veera Simha Reddy థియేటర్ లో మాస్ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. రచ్చ చేసిన ఫ్యాన్స్

Ram Charan-Upasana: నాతో కలిసి నా బిడ్డకూ ఇది స్పెషల్ ఎక్స్ పీరియన్స్.. ఉపాసన ఎమోషనల్ ట్వీట్

Veera Simha Reddy Unstoppable 2 Promo: వీరసింహారెడ్డి టీమ్‌తో బాలకృష్ణ.. అన్ స్టాపబుల్ షోలో రచ్చ మాములుగా లేదుగా

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

 

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version
Skip to toolbar