Telugu Movies: ఈ వారం అటు థియేటర్లో.. ఇటు ఓటీటీలో చిన్న సినిమాలు సందడి చేయనున్నాయి. వేసవిలో పెద్ద సినిమాలు సందడి ఎక్కువగా ఉండేది. ఇక ఈ చివరి వారం చిన్న చిత్రాలే సందడి చేయనున్నాయి. దీంతో పాటు.. ఓటీటీలో సరికొత్త చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు అలరించనున్నాయి.
‘మళ్లీ పెళ్లి’ (Telugu Movies)
నరేష్, పవిత్ర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మళ్లీ పెళ్లి. ఈ చిత్రానికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 26 థియేటర్‌లలో విడుదల కానుంది. ప్రేమ, భావోద్వేగాలతో కూడిన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమా ట్రెండింగ్ లో ఉంది.
30మంది కొత్త నటీనటులతో..
సుమంత్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం మేమ్ ఫేమ్. ఈ చిత్రాన్ని సుమంత్ ప్రభాస్ స్వయంగా తెరకెక్కించారు. ఛాయ్ బిస్కెట్, లహరి ఫిలింస్ పతాకాలపై సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా కూడా ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘తెలంగాణలోని ఒక ఊరిలో జరిగే కథ ఇది. ఈ కథకు తగ్గట్లుగా 30మంది కొత్త నటీనటుల్ని ఎంపిక చేసి సినిమా చేశారు.
కేరళలో అదరగొట్టి..
జూడే ఆంథోని జోసెఫ్ దర్శకత్వంలో టోవినో థామస్, కుంచకో బోబన్, అసిఫ్ ఆలీ, లాల్ తన్వి రామ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘2018’. ఇటీవల మలయాళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. 10 రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ క్రమంలో ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. మే 26 ‘2018’ తెలుగు వెర్షన్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే!
సల్మాన్ చిత్రం
సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా ఫర్హద్ సమ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఎంటర్‌టైనర్ ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’. పూజా హెగ్డే కథానాయిక. తెలుగు హీరో వెంకటేశ్ కీలక పాత్ర పోషించారు. తమిళ సూపర్ హిట్ ‘వీరమ్’కు రీమేక్‌గా దీన్ని తెరకెక్కించారు. మే 26వ తేదీ నుంచి జీ5 ఓటీటీ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.
‘భేదియా’
వరుణ్ ధావన్ కృతి సనన్ జంటగా నటించిన హారర్ కామెడీ మూవీ ‘భేదియా’ . తెలుగులో దీన్ని ‘తోడేలు’ పేరుతో విడుదల చేశారు. అమర్ కౌశిక్ తెరకెక్కించారు. ప్రముఖ స్ట్రీమింగ్ వేదిక జియో సినిమాలో మే 26వ తేదీ నుంచి ‘భేదియా’ స్ట్రీమింగ్ కానుంది.
సిటడెల్ ఫైనల్ ఎపిసోడ్
అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా చివరి ఎపిసోడ్ మే 26 స్ట్రీమింగ్ కానుంది.
నెట్‌ఫ్లిక్స్
విక్టిమ్/సస్పెక్ట్ (హాలీవుడ్) మే 23
మదర్స్ డే (హాలీవుడ్) మే 25
ఫ్యూబర్ (వెబ్‌సిరీస్) మే 25
బ్లడ్ అండ్ గోల్డ్ (హాలీవుడ్) మే 26
అమెజాన్ ప్రైమ్
మిస్సింగ్ (ఒరిజినల్ మూవీ) మే 24
జీ5
సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై (ఒరిజినల్ మూవీ) మే 23
డిస్నీ+హాట్‌స్టార్
అమెరికన్ బోర్న్ చైనీస్ (వెబ్‌సిరీస్) మే 24
సిటీ ఆఫ్ డ్రీమ్స్ (వెబ్‌సిరీస్) మే 26
ఆహా
గీతా సుబ్రహ్మణ్యం (తెలుగు సిరీస్-3) మే 23
సత్తిగాని రెండెకరాలు (తెలుగు) మే 26