Janasena Party : ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న టాలెంటెడ్ స్టంట్ మాస్టర్స్‌లో బద్రి ఒకరు. ఎన్నో ఏళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో స్టంట్ మాస్టర్‌గా పనిచేస్తూ.. తన ఫైట్స్‌తో, యాక్షన్ ఎపిసోడ్స్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు బద్రి. తాజాగా బద్రి.. హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్‌ను కలిశారు. జనసేన పార్టీ కోసం విరాళాలు ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. విశాఖపట్నంలో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నప్పటి నుంచి బద్రి తనకు తెలుసని.. అప్పటినుండి తనతో పరిచయం ఉందన్నారు. అలానే “28 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ చేసిన సాయమే నన్ను నిలబెట్టింది. సార్ చేసే సాయం నాతో ఆగిపోకూడదు. ఎందరికో ఆయన సాయం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే నాలాంటి ఎంతో మందికి అండగా నిలుస్తారని అందుకే జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చాను అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఒక వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు.
Janasena Party : పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి విరాళం అందించిన స్టంట్ మాస్టర్ బద్రి..

stunt master badri donation to pawan kalyan janasena party