Site icon Prime9

OTT Movies: ఈ వారం ఓటీటీ సందడి.. విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే

ott

ott

OTT Movies: ఈ వారం ఓటీటీలో పలు సినిమాలు సందడి చేయనున్నాయి. థియోటర్లతో పోలీస్తే.. ఈ కాలంలో ఎక్కువ ఓటీటీలే వినోదాన్ని పంచుతున్నాయి. ఈ వారం ప్రేక్షకులను అలరించడానికి.. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదల కానున్నాయి. ఈ వారం సినిమాలు, సిరీస్‌లు కలిపి 20కిపైగా వస్తున్నాయి. అవెంటో ఓసారి చూద్దాం.

శాకుంతలం.. (OTT Movies)
సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం శాకుంతలం. ఈ సినిమాను గుణశేఖర్ తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద.. పెద్దగా ఆడలేదు. దీంతో ఈ సినిమా సైలెంట్ గా ఎలాంటి ప్రచారం లేకుండా ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ వేదికగా గురువారం విడుదలైంది.

‘న్యూసెన్స్‌’
నవదీప్‌, బిందు మాధవి కీలక పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘న్యూసెన్స్‌’. ఈ సిరీస్ కు శ్రీప్రవీణ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ సిరీస్‌ తెలుగు ఓటీటీ ‘ఆహా’లో మే 12 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. మీడియా, రాజకీయం ఇతివృత్తంగా మదనపల్లి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిందీ సిరీస్‌.

సోనాక్షి తొలి సిరీస్‌.. ‘దహాడ్‌’
సోనాక్షి సిన్హా , విజయ్‌వర్మ, గుల్షన్‌ దేవయ్య, సోహమ్‌ షా ప్రధాన పాత్రధారులుగా.. రీమా కగ్తీ, జోయా అఖ్తర్‌ తెరకెక్కించిన వెబ్‌సిరీస్‌ ‘దహాడ్‌’ (Dahaad). మే 12 నుంచి ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ వేదికగా ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. సోనాక్షి నటించిన తొలి వెబ్‌ సిరీస్‌ ఇది. ఇందులో ఆమె.. అంజలి భాటి అనే పోలీసు పాత్రలో కనిపించనుంది.

నెట్‌ఫ్లిక్స్‌
రాయల్‌ టీన్‌: ప్రిన్సెస్‌ మార్గరెట్‌ (హాలీవుడ్): స్ట్రీమింగ్ అవుతోంది.
ఎరినీ (హాలీవుడ్‌): స్ట్రీమింగ్ అవుతోంది.
ది మదర్‌ (హాలీవుడ్‌): మే 12
క్రాటర్‌ (హాలీవుడ్): మే 12
బ్లాక్‌ నైట్‌ (వెబ్‌ సిరీస్‌): మే 12
క్వీర్‌ ఐ (వెబ్‌ సిరీస్‌): మే 12
మల్లిగన్‌ (వెబ్‌ సిరీస్‌): మే 12
తిరువిన్‌ కురల్‌ (తమిళ్‌): మే 12

అమెజాన్‌ ప్రైమ్‌
సి.ఎస్‌.ఐ. సనాతన్‌ (తెలుగు): స్ట్రీమింగ్‌ అవుతోంది.
విచిత్రం (మలయాళం): స్ట్రీమింగ్‌ అవుతోంది.
ఎయిర్‌ (హాలీవుడ్): మే 12
యాథిసయ్‌ (తమిళ్‌): మే 12
జీ5
తాజ్‌: ది రీన్‌ ఆఫ్‌ రివెంజ్‌ (హిందీ సిరీస్‌-2): మే 12

డిస్నీ+హాట్‌స్టార్‌
ది మప్పెట్స్‌ మేహెమ్‌ (వెబ్‌సిరీస్‌): మే 10
స్వప్న సుందరి (తమిళ/తెలుగు): మే 12
సోనీ లివ్‌
ట్రాయాంగిల్‌ ఆఫ్ సాడ్‌నెస్‌ (హాలీవుడ్): మే 12

జియో సినిమా
విక్రమ్‌ వేద (హిందీ): మే12

సన్‌నెక్ట్స్‌
రుద్రుడు (తమిళ్‌, తెలుగు): మే 14

ఆహా
సి.ఎస్‌.ఐ. సనాతన్‌ (తెలుగు): స్ట్రీమింగ్‌ అవుతోంది.
దాస్‌ కా ధమ్కీ (తమిళ్‌): మే 12

Exit mobile version