Site icon Prime9

Kodali Nani: సీఎం జగన్ పై విషం కక్కుతున్న మీడియా.. కొడాలి నాని

Andhra Pradesh: సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రతి పక్షాలతో పాటు కొన్ని మీడియా ఛానల్లు విషం కక్కుతున్నాయని మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నాని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ని భ్రష్టు పట్టించాలని ప్రతిపక్షాలు కొన్ని మీడియా ఛానల్లతో పాటు చంద్రబాబు దత్తపుత్రుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు.

నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న కొడాలికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా టిటిడి అధికారులు స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రజలు, ప్రభుత్వం బావుండాలని శ్రీవారిని కోరుకున్నట్లు కొడాలి నాని తెలిపారు.

Exit mobile version