Site icon Prime9

Dhanush: ధనుష్, ఐశ్వర్య విడాకులు కాన్సిల్.. రజినీ ఇంట సంబరాలు..!

dhanush aishwarya reunited

dhanush aishwarya reunited

Dhanush: తమిళ స్టార్ హీరో ధనుష్, కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ జంట విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి విదితమే. కాగా తాజాగా వీరిద్దరూ విడాకులు తీసుకోవడం లేదు కలవబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

హీరో ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ ఈ ఏడాది జనవరి 17న విడాకులు తీసుకుంటాన్నామంటూ సోషల్ మీడియా వేదికగా వేరువేరుగా ప్రకటించారు. కాగా తమ 18ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలుకుతున్నట్టు వీరిరువురూ వెల్లడించారు. అయితే వీరిద్దరూ విడిపోవడం ఇష్టంలేని ఐశ్వర్య తండ్రి రజినీ కాంత్, ధనుష్ తండ్రి కస్తూరి రాజా వీరిరువురి మధ్య రాజీ కుదుర్చాడానికి ఎంతగానో ప్రయత్నించారట. అయినప్పటికి వీరు ఎడమొహం పెడమొహంగానే ఉంటూ తొమ్మిది నెలలుగా వేర్వేరుగా నివసిస్తున్నారు. అయితే తాజాగా వీరిద్దరు మళ్లీ కలవబోతున్నారనే వార్త కోలీవుడ్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.

అయితే ఈ జంటకు యాత్రా, లింగ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. విడాకులు ప్రకటన అనంతరం వీరద్దరూ జంటగా కనిపించిన జాడ కానరాలేదు.
కానీ, కొద్దిరోజుల క్రితం మాత్రం యాత్రా స్కూల్ ఈవెంట్‌లో ధనుష్, ఐశ్వర్య జోడీగా కనిపించారు. కాగా దానికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారడంతో ధనుష్, ఐశ్వర్య మళ్లీ కలవబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దానికి బలం చేకూర్చేలా ఓ వార్త కోలీవుడ్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఇటీవల రజినీకాంత్ నివాసంలో ధనుష్, ఐశ్వర్య సమావేశం అయ్యారట. ప్రస్తుతానికి విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయకూడదని నిర్ణయించుకున్నారని,  విభేదాలను పరిష్కరించుకుని మళ్లీ కలసిపోవాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఇక ఈ వార్త విని ధనుష్ అభిమానులు ఫుల్ ఖుషి అయిపోతున్నారు.

ఇదీ చదవండి:  “ది ఘోస్ట్” రివ్యూ.. సూపరో సూపర్ అంటున్న ఫ్యాన్స్

Exit mobile version