Site icon Prime9

Rashmika Mandanna: నీ బాయ్ ఫ్రెండ్ అనకొండకి ఏం జరిగిందో నీకు అదే రిపీట్ అవుతుంది.. రష్మికను దారుణంగా ట్రోల్ చేసిన “కేఆర్కే” !

rashmika mandanna

rashmika mandanna

Rashmika Mandanna: నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. నాగ శౌర్యతో జంటగా నటించిన ” ఛలో ” సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది రష్మిక. ఆ తర్వాత గీత గోవిందం, భీష్మ, సరిలేరు నీకెవ్వరు , లాంటి వరుస హిట్స్ ను తన ఖాతాలో వేసుకొని మంచి జోష్ లో ఉంది ఈ కన్నడ బ్యూటీ. ఇక అల్లాఉ అర్జున్ సరసన నటించిన “పుష్ప” శనిమాతో దేశవ్యాప్తంగా ఫుల్ కేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు. దీంతో సౌత్‌ ఇండస్ట్రీ లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీ అయిపోయింది.

ఫుల్ బిజీగా రష్మిక..

బాలీవుడ్ లో వరుస ఆఫర్లను ఒకే చేస్తున్న ఈ భామకి సరైన హిట్ పడలేదనే చెప్పాలి. ఇటీవల గుడ్ బై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక(Rashmika Mandanna)కు.. ఆ సినిమా నిరాశనే మిగిల్చింది. దీంతో యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో నటిస్తున్న మిషన్ మజ్ను పైనే ఈ అమ్మడు ఆశ పెట్టుకుంది. దాంతో పాటు తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ సరసన వారిసు అనే సినిమాలో కూడా నటించింది. తెలుగులో ఈ సినిమా వారసుడు పేరుతో రిలీజ్ కానుంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం రిలీజ్ కానుంది. అయితే మరోవైపు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతుంది రష్మిక. ఇటీవల కాంతారా చిత్రం విషయంలో ఫుల్ గా ట్రోల్ అయిన రష్మిక, కొద్దిరోజుల క్రితం సౌత్ సాంగ్స్ కంటే నార్త్ సాంగ్స్ బాగుంటాయంటూ కామెంట్స్ చేసి సోత్ ప్రేక్షకుల ఆగ్రహానికి గురైంది. అయితే ఇప్పుడు తాజాగా రష్మికపై బాలీవుడ్‌ క్రిటిక్‌ కేఆర్కే దారుణమైన కామెంట్స్‌ చేశాడు.

దారుణమైన ట్వీట్లు..

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా రెండు త్వవేత లు చేశాడు. ఆ ట్వీట్స్ లో ‘మేడమ్ రష్మిక జీ.. మా హిందీ ప్రేక్షకులు మీ బాయ్‌ఫ్రెండ్ అనకొండ సినిమా లైగర్‌ను రిజెక్ట్ చేసి అతన్ని బాలీవుడ్ నుంచి ఎలా పంపించామో.. మీకు కూడా అదే పరిస్థితి ఎదురవుతుంది. మిమ్మల్ని భోజ్‌పురి చిత్రాల్లో చూడటం మాకు ఆనందంగా ఉంటుంది’ అంటూ ట్వీట్ చేశాడు.

మరో ట్వీట్ లో ఆమెను నేషనల్ క్రష్ అని పిలుస్తున్న వారంతా కళ్ళను చెక్ చేసుకోవాలని… ఆమె రవి కిషన్, పవన్ సింగ్ , నిరాహువా, కీసరిలాల్ కు జతగా నటించాలని అంటూ రాసుకొచ్చాడు. దీంతో అతడి ట్వీట్‌పై అటు రష్మిక ఫ్యాన్స్‌, ఇటు విజయ్‌ ఫ్యాన్స్‌ ఫుల్ గా మండిపడుతున్నారు. ఎప్పుడు ఏదో ఒక ట్వీట్ చేస్తూ ఫేమ్ కోసం పనికిమాలిన పనులు అన్నీ చేసే నువ్వు ..ముందు నీ సంగతి చూసుకో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు కష్టపడి ఆ స్థాయికి చేరుకున్నారని నీలాంటి వారి మాటలు కుక్కలు మొరగడంతో సమానం అని ఫైర్ అవుతున్నారు. ఇక విజయ్ దేవరకొండపై క్రష్ ఉందని బాలీవుడ్ టాప్ స్టార్స్ ఏ చెప్పారని నీలాంటి వాడు విజయ్, గురించి రష్మిక గురించి మాట్లాడడం సరికాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఇవి కూడా చదవండి:

Kantara: బిగ్ సర్‌ప్రైజ్.. ఆస్కార్‌కు క్వాలిఫై అయిన “కాంతారా”

Unstoppable Show: అన్ స్టాపబుల్‌లో సందడి చేయనున్న “వీర సింహారెడ్డి” టీం… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Vasantha Krishna prasad: ఈ రోజుల్లో రాజకీయం చేయాలంటే 10 మంది పోరంబోకులు వెంట ఉండాలి.. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

Pathaan Trailer: యాక్షన్.. యాక్షన్.. యాక్షన్.. దుమ్మురేపుతున్న షారూఖ్ ఖాన్ “పఠాన్” ట్రైలర్

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version
Skip to toolbar