Site icon Prime9

Pawan Kalayan: గూస్ బంప్స్ తెప్పిస్తున్న “పవన్” సినిమా పోస్టర్.. “సాహో” డైరెక్టర్ తో కొత్త చిత్రం

pawan-kalyan-next-movie-under-sujeeth-direction-announced-officially

pawan-kalyan-next-movie-under-sujeeth-direction-announced-officially

Pawan Kalayan: పవన్ అభిమానులుకు గుడ్ న్యూస్. పవన్‌ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలు.. మరోవైపు వరుసగా సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తున్నారు. ‘అజ్ఞాతవాసి’ తర్వాత పవన్‌ దాదాపు నాలుగేళ్లు గ్యాప్‌ తీసుకుని ‘భీమ్లానాయక్‌’తో ఇటీవలే అభిమానులను పలకరించి భారీ హిట్ సంపాధించాడు. ఇకపోతే ప్రస్తుతం అదే జోష్‌తో పవన్ క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని పూర్తి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రథమార్థంలో రిలీజ్‌ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగానే పవన్‌ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడు.

రన్‌ రాజా రన్‌, సాహో వంటి సినిమాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్‌ డైరెక్టర్‌ సుజీత్‌ దర్శకత్వంలో పవన్‌ తన తదుపరి సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. డీవివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా డీఎస్పీ ఈ సినిమాకు మ్యూజిక్ అందించనున్నట్టు అనౌన్స్‌ చేస్తూ ఈ చిత్రానికి సంబంధించిన మేకర్స్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పోస్టర్‌ మొత్తం ఎరుపు రంగుతో డిజైన్‌ చెయ్యగా దానిపై చైనీస్ అక్షరాలు కూడా రాసి ఉన్నాయి. పోస్టర్‌లో పవన్‌ కళ్యాణ్‌ను ఓజీ అని పిలుస్తారు అని రాసి ఉంది. కాగా ఈ ఒక్క పోస్టర్‌తోనే మేకర్స్‌ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్‌ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపకుంటుంది. మరి ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.ఈ పోస్టర్ తో పవన్ అభిమానులు తెగ సంబరాలు చేసుకుంటున్నారు.

ఇదీ చదవండి: నేనొక ఓడిపోయిన రాజకీయ నాయకుడిని.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Exit mobile version