Site icon Prime9

Samantha: సమంత కుటుంబం నాగ చైతన్యని మర్చిపోలేకపోతున్నారా?

sam prime9news

sam prime9news

Samantha : తెలుగు సినీ పరిశ్రమలో  నాగ చైత‌న్య , స‌మంతకు క్రేజ్ మామూలుగా లేదు ఒక రేంజులో ఉందనే చెప్పుకోవాలి. వీళ్ళద్దరు ఒకప్పుడు తెలుగు అభిమానుల ఆల్ టైమ్ ఫేవ‌రేట్ కపుల్ గా ఉన్నారు. వీళ్ళు ప్రేమించుకొని ఇంట్లో ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్ళి చేసుకున్నారన్నా విషయం అందరికీ తెలిసిందే. ఒకప్పుడు వీళ్ళ జంటను చూసి ఇలా ఉండాలి అనుకునే వాళ్ళు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల విడాకులు తీసుకోవాలిసి వచ్చింది. ఇప్పుడు వీరు ఎలా ఉన్నారంటే ఇద్దరూ మద్యలో పచ్చ గడ్డి వేస్తే  భగ్గుమని ఎలా ఉంటుందో అలా ఉంది. విడాకులు తీసుకున్న రోజు నుంచి ఇప్పటి వరకు కూడా వీళ్ళ మీద ఏదో రూమర్ వస్తూనే ఉంది. ఇప్పటికి వీళ్ళు విడాకులు తీసుకొని ఒక సంవత్సరం అవుతుంది.

ఐతే అభిమానులు వీళ్ళు కలిసి ఉన్నా  జ్ఞాపకాలను మర్చిపోలేక, మళ్ళీ  వీళ్ళు కలిస్తే బావుండని అందరూ కోరుకుంటున్నారు. చెప్పాలంటే స‌మంత కుటుంబ స‌భ్యులు నాగ చైతన్యను మరువలేక  ఉన్నారని తెలిసిన సమాచారం. సోషల్ మీడియా వేదికగా స‌మంత తండ్రి జోసెఫ్ ప్ర‌భు నాగ చైత‌న్య‌తో తనకున్న అనుబంధాన్ని పోస్ట్ చేశారు. “కొద్ది రోజుల కిందట మా జీవితంలో ఒక క‌థ ఉండేది కానీ ఇప్పటి నుంచి ఆ కథ మా జీవితంలో ఉండదు. ఇక పై కొత్త క‌థ‌ను, కొత్త అధ్యాయాన్ని  మొదలు పెడదాం ” అంటూ ఆయన పోస్టులో వెల్లడించారు.

Exit mobile version