Site icon Prime9

Dil Raju: నన్ను కార్నర్ చేసే సీన్ ఎవరికీ లేదు.. కానీ నా సినిమా రెండు రోజులు వాయిదా వేసుకున్నాను.. దిల్ రాజు

Dil Raju

Dil Raju

Dil Raju: మొత్తంమీద దిల్ రాజు వెనక్కి తగ్గారు. చిరంజీవి, బాలయ్య సినిమాలకు ధీటుగా తాను నిర్మించిన వారసుడు చిత్రాన్ని కూడా ఈ సంక్రాంతికి విడుదల చేస్తానని చెప్పిన దిల్ రాజు తాను రెండు రోజులు ఆలస్యంగా అంటే జనవరి 14న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

జనవరి 14న వారసుడు..

‘వారసుడు’ విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాత దిల్‌రాజు (Dil Raju) ప్రకటించారు. ఈ వివాదంలో తానే వెనక్కి తగ్గానని చెప్పారు.

తనను కార్నర్ చేసే సీన్ ఎవరికీ లేదన్నారు దిల్ రాజు. ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ చిత్రాలను దృష్టిలో పెట్టుకుని తమ చిత్రాన్ని వాయిదా వేస్తున్నానని వెల్లడించారు.

రెండు రోజులు ఆలస్యంగా వారసుడు సినిమాను జనవరి 14న విడుదల చేయనున్నట్లు తెలిపారు.

‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ చిత్రాలను దృష్టిలో పెట్టుకుని తమ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. అంతేకాదు.. వారసుడు సినిమాపై తమకు 100 శాతం నమ్మకం ఉందని.. గతంలో తమ బ్యానర్ నుంచి సంక్రాంతికి వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శతమానం భవతి, ఎఫ్ 2 సినిమాల మాదిరిగా వారసుడు కూడా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలియాలి అంటూ ఓ కొత్త పాయింట్

కుటుంబ కథా చిత్రమే అయినా ఈ మూవీలో ఓ కొత్త పాయింట్ ఉంటుందని.. సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అందరూ ఈ పాయింట్‌ను మాత్రమే గుర్తుంచుకుంటారని దిల్ రాజు అన్నారు.మూవీలో విజయ్ సరసన ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టించగా.. శ్రీకాంత్, శ‌ర‌త్‌కుమార్‌, కిక్ శ్యామ్, సంగీత , జ‌య‌సుధ‌, ఖుష్బూ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

చిత్ర పరిశ్రమలో అన్ని నిర్ణయాలు చివరి నిమిషంలోనే జరుగుతాయి. నా సినిమా బిజినెస్ కూడా చూసుకోవాలి కదా.. పవన్ కళ్యాణ్ గారు ఊరికే అనలేదు.. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలియాలి అని అంటూ దిల్ రాజు (Dil Raju) పవర్ స్టార్ డైలాగ్ చెప్పారు. వారసుడు సినిమాలో విజయ్ అభిమానులకు కావలసిన అంశాలు ఉంటాయని అన్నారు.

పెద్ద హీరోలకే ప్రిఫరెన్స్

రెండు తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు (Dil Raju) చేతిలో పెద్ద సంఖ్యలో థియేటర్లు ఉన్నాయి. అయితే టాలీవుడ్ కు చెందిన అగ్రహీరోల చిత్రాలు తెలుగువారికి ప్రత్యేకమైన పండుగ సందర్బంగా విడుదలవుతుండగా తమిళ హీరో సినిమాను రిలీజ్ చేయడమేమిటంటూ పలువురు విమర్మించారు.

అయితే దిల్ రాజు మాత్రం తన చిత్రాన్ని తన థియేటర్లలో రిలీజ్ చేసేవిషయంలో వెనక్కి తగ్గలేదు. మరోవైపు పరిశ్రమలో అగ్రనిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్ కూడ దిల్ రాజు నిర్ణయంలో తప్పు లేదంటూ పరోక్షంగా సమర్దించడం గమనార్హం.

ఇవి కూడా చదవండి:

Waltair Veerayya: లక్ష్మణరేఖనైనా దాటుతాను కానీ సురేఖను దాటను.. సుమ అడ్డాలో చిరు కామెంట్స్

Nandamuri Balakrishna : తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి ఓపెన్ అయిన బాలకృష్ణ..

KGF 3: 2025లో సెట్స్ పైకి వెళ్లనున్న KGF 3.. మరోసారి రాకీభాయ్ గా కనిపించనున్న హీరో యష్

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version