Site icon Prime9

Latest Crime News: మహిళ గొంతు కోసిన ఉన్మాది… పెళ్లైందన్నా వినకుండా..!

Begumpet crime news

Begumpet crime news

Latest Crime News: హైదరాబాద్ బేగంపేటలో దారుణం జరిగింది. పేస్ బుక్ పరిచయం ఆ మహిళ ప్రాణాలు తీసింది. పెళ్లైందని చెప్పినా వినిపించుకోకుండా ఆ మృగాడు ఆ మహిళకు న్యూడ్ వీడియో కాల్స్ చేసి వేధించేవాడు. ఫోన్ ఎత్తకపోతే చంపేస్తానంటూ బెదిరించేవాడు. అంతటితో ఆగక ఆమె భర్తను వదిలేసి రావాలని హింసించేవాడు. దానికి నిరాకరించిందని ఆ మహిళను నేడు బీర్ బాటిల్తో గొంతుకోశాడు.

హైదరాబాద్‌లోని బేగంపేట్‌ కుందన్‌బాగ్‌ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. బిఎస్ మక్తాలో నివాసం ఉంటున్న ఓ మహిళను జూబ్లీహిల్స్ చెందిన పీఏ విజయ్ సింహ హత్యచేశాడు ఈవెంట్ చేసుకుంటూ భర్త సూరజ్తో పాటు నివాసం ఉంటోన్న మహిళకు ఈ మధ్యకాలంలోనే ఫేస్‌ బుక్‌ ద్వారా జూబ్లీహిల్స్‌ చెందిన పీఏ విజయ్‌ సింహ పరిచయం అయ్యాడు. రానురాను ఆ పరిచయం కాస్త మరింత సన్నిహితంగా మారింది. వీడియోకాల్స్‌లో ద్వారా ఇద్దరూ మాట్లాడుకునేవారు. ఇంకేముంది అంతే సంగతి ఆ పరిచయం తన కొంప ముంచింది. తన భర్తను వదిలేసి తనతో ఉండాలంటూ విజయ్ సింహ తనను బెదిరంచేవాడు. తన కోరిక తీర్చాలని న్యూడ్ వీడియో కాల్‌ చేసేవాడు. ఆమె ఫోన్‌ ఎత్తకపోయనా, భర్తకు చెప్పినా చంపేస్తానని బెదిరించ సాగాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన భర్తకు చెప్పడంతో.. గతంలో ఈ విషయంపై పోలీసులకు
ఫిర్యాదు చేశాడు.

కాగా ఇవాళ ఉదయం ఆ మహిళ ఇంట్లోకి చొరబడిన విజయ్ సింహ.. తన కోరిక తీర్చాలంటూ ఆమెపై బలవంతం చేయబోయాడు.
దాన్ని ఆమె అడ్డుకోవడంతో బీర్ బాటిల్ పగలగొట్టి ఆమె గొంతు కోసాడు. అంతటితో ఆగకుండా విజయ్ తో వచ్చిన వ్యక్తి ఆమె చెయ్యి విరిచేసి ఇద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న బాధితురాలు ఈ విషయాన్ని తన భర్త సూరజ్ కు వీడియో కాల్ చేసి చెప్పింది.
ఇంటికి వచ్చి చూసిన సూరజ్ షాక్ తిన్నాడు. హుటాహుటిన భార్యను సమీప ఆసుపత్రికి తీసుపత్రికి తరలించి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమకు రక్షణ కల్పించాలని పోలీసులను సూరజ్ కోరాడు.

ఇదీ చదవండి: Viral News: కుక్కను కారుకు కట్టేసి ఊరంతా తిప్పిన వైద్యుడు… వీడియో వైరల్

Exit mobile version