Donald Trump: ట్విట్టర్‌లోకి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీ ఎంట్రీ ఇచ్చారు. జీవితకాల నిషేధానికి గురైన ట్రంప్ ఖాతాను ట్విట్టర్ నూతన అధినేత ఎలాన్ మస్క్ పునరుద్ధరించారు. 2021 జనవరిలో జరిగిన క్యాపిటల్ హిల్ దాడి తర్వాత ట్రంప్ అకౌంట్‌ను మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల మస్క్ ట్విట్టన్ ను సొంతం చేసుకున్న తర్వాత ట్రంప్ ఖాతా పునరుద్ధరణపై మస్క్ ఓటింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే.
The people have spoken.
Trump will be reinstated.
Vox Populi, Vox Dei. https://t.co/jmkhFuyfkv
— Elon Musk (@elonmusk) November 20, 2022
Reinstate former President Trump
— Elon Musk (@elonmusk) November 19, 2022
కాగా ఆ ఓటింగ్ లో 51.8 శాతం మంది ట్రంప్‌కు అనుకూలంగా ఓటువేశారు. దానితో మాజీ అధ్యక్షుడి ఖాతాను పునరుద్ధరిస్తున్నామని మస్క్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో దాదాపు 22 నెలల తర్వాత ట్రంప్ ఎకౌంట్ ట్విట్టర్‌లో మళ్లీ ప్రత్యక్షమైంది. ఈ సందర్భంగా ‘ప్రజల స్వరం, దేవుని స్వరం’ (వోక్స్ పాపులి, వోక్స్ డీ) అంటూ ల్యాటిన్ పదబంధాన్ని కొంతమంది ప్రజలు కామెంట్ చేశారు. డోనాల్డ్ ట్రంప్‌కు తిరిగి ట్విట్టర్ ఖాతాను ఇద్దామా వద్దా అని ఎలాన్ మస్క్ పోల్ నిర్వహించారు. ఎస్ ఆర్ నో చెప్పాలంటూ శనివారం ఆయన ఓ ట్వీట్ చేశారు. 24 గంటలపాటు కొనసాగిన ఈ పోల్‌లో కోటీ 50 లక్షల 85వేల 458 మంది పాల్గొన్నారు. అందులో 51.8 శాతం మంది ట్రంప్‌కు అనుకూలంగా, 48.2 శాతం మంది వ్యతిరేకంగా స్పంధించారు. దీనితో మెజారిటీ ప్రజలు ట్రంప్ కు అనుకూలంగా ఉండడంతో ట్రంప్ ఖాతా ట్విట్టర్ మరల తెరబడింది.
ఇదీ చదవండి: ట్విట్టర్లో కొత్త పాలసీ.. ఇకపై అలాంటి పోస్టులకు అడ్డుకట్ట